టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఐటీ రంగానికి ఉన్న ప్రాధాన్యతను అందరికన్నా ముందుగా గుర్తించిన చంద్రబాబు….హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు చేశారు. ఐటీ సేవలందించే ప్రధాన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నేడు లక్షలాదిమందికి ఉపాధి కల్పించిందంటే అదంతా చంద్రబాబు ముందుచూపు చలవే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు విదేశాల్లో లక్షలాది మంది తెలుగు వారు ఐటీ రంగంలో సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కారణం చంద్రబాబే అనడం అతిశయోక్తి కాదు.
ముందుచూపుతో చంద్రబాబు నెలకొల్పిన మెడికల్ హబ్….కరోనా విపత్తు వేళ దేశానికే తలమానికమైంది. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడి మాస్కులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఏపీ ఆ సమస్యను అవలీలగా అధిగమించిందంటే అది చంద్రబాబు ముందుచూపే. విశాఖలో చంద్రబాబు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ లో లక్షలాది మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేసి మిగతా రాష్ట్రాలకూ సరఫరా చేశామంటే అది చంద్రబాబు పాలనా దక్షత వల్లే.
తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాలనూ వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ చంద్రబాబు ముందు చూపు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. భద్రాచలం సమీపంలో గోదావరి నది ఉగ్రరూపు దాల్చడంతో ఆ పట్టణంతా జలమయమైంది. కొన్ని ఇళ్లు సగం దాకా మునిగిపోతే.. మరికొన్ని ఎనిమిది అడుగుల దాకా మునిగిపోయాయి! షెడ్లు, చిన్న చిన్న రేకుల ఇళ్లయితే పూర్తిగా మునిగిపోయాయి! గోదావరి నీటిమట్టం 32 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టి 71.9 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం 32 ఏళ్ల నాటి రికార్డును అధిగమించిందని చెబుతున్నారు. 1986లో రికార్డు స్థాయిలో 75.6 అడుగుల ఎత్తుతో, 1953లో 72.5 అడుగుల ఎత్తుతో, 1990లో 70.8 అడుగుల మునిగిపోయాయి.
మామూలుగా అయితే, ఈ రికార్డు స్థాయి వరద నీటికి భద్రాచలం మునిగిపోవాలి. కానీ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎంతో ముందుచూపుతో భద్రాచలం పట్టణానికి వరద ముప్పు నివారించేందుకు కరకట్టను నిర్మించారు. చంద్రబాబు హయాంలో రూ.53కోట్లతో ఏటపాక నుంచి సుభాష్ నగర్ వరకు 10 కిలోమీటర్ల వరకు కరకట్ట నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు రాములోరి భద్రాద్రికి రక్షణ కవచంగా నిలిచింది. 10 వేల కుటుంబాలు వరద ముంపునకు గురవకుండా కాపాడింది.
ప్రస్తుతం కరకట్ట లేని ప్రాంతంతోపాటు కరకట్టలో ఉన్న స్లూయిస్ లీకుల కారణంగా వస్తున్న నీటితోనే భద్రాచలం దిగువ ప్రాంతం జలమయమైంది. అదే ఈ కరకట్టే లేకపోతే భద్రాచలం మూడొంతులు జలమయమయ్యే పరిస్థితి ఉండేదని స్వయంగా భద్రాద్రి ఆలయ అర్చకులు చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో చంద్రబాబుకు, ఆనాడు టీడీపీ నేతగా ఉన్న తుమ్మలకు పేరొస్తుందన్న అక్కసుతో భద్రాచలంలో 144 సెక్షన్ విధించారన్న విమర్శలు వస్తున్నాయి. కానీ, వరద ముంపు ప్రాంతం కాబట్టి 144 పెట్టామని పోలీసులు చెబుతున్నారు.
Comments 1