స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ రోజు హైకోర్టుకు గైర్హాజరయ్యారు. నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు.
విచారణ కోసం మరింత సమయం కావాలని కోరారు. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు చంద్రబాబు పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును కూడా సుప్రీం కోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.