గత ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయినా.. కేవలం 23 స్థానాల్లో గెలిచి.. నలుగురు ఎమ్మెల్యేలను పోగొట్టు కున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా మానసిక స్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఎవరున్నా.. ఎవరు పోయినా.. ప్రజలు ఉన్నారనే కాన్సెప్టుతో ఆయన అనేక రూపాల్లో ప్రజల మధ్యే ఉంటున్నారు. కరోనా వ చ్చిన ఏడాదిన్నర సమయంలోనూ జూమ్ మీటింగుల ద్వారా నాయకులకు, కార్యకర్తలకు చేరువయ్యారు.
ఇక, ఆ తర్వాత నేరుగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోయారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంత రం పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజానికి ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పడు.. టీడీపీ ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో వైఎస్‌పై యుద్ధం ప్రకటించాల్సి వచ్చినా.. ఏ నాడూ.. ఈ రేంజ్లో అయితే.. చంద్రబాబు బయటకు రాలేదు. ఎన్నికలకు ముందు మాత్రమే బయటకు వచ్చారు.
ఈసారి మాత్రం జగన్‌ను, ఆయన సర్కారును సంపూర్ణంగా లక్ష్యం చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఏడాది సమయం ముందే.. దూకుడు పెంచారు. ఇక, ఈ నెల 16 నుంచి ఆయన పూర్తిగా ఏపీలోనే ఉండాల ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని.. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఇప్పటికే అధిగమిం చారని వారు చెబుతున్నారు.
ఇక, ఇప్పుడు పార్టీ పరంగా మరింత దూకుడు ప్రదర్శించి.. నిత్యం ప్రజల్లోనే ఉండడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారని అంటున్నారు. చంద్రబాబు శపథం నెరవేర్చుకోవడంతోపాటు.. మరింత వేడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో విజయం తథ్యమనే దిశగా పార్టీ ని నడిపించాలనేది ప్రస్తుత వ్యూహంగా చెబుతున్నారు. అందుకే ఆగస్టు 16నుంచి ఏపీలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు చెబుతున్నారు.