టీడీపీ అధినేత చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని వైద్యులు చెబుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్యులు కూడా ఈ ఆపరేషన్ చేయాలని సూచించారని, ఆ వైద్య నివేదికను మార్చాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తాజా హెల్త్ బులెటిన్ లో ఆ కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ వెర్షన్ మరోలా ఉంది. చంద్రబాబుకు 4 నెలల క్రితం కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఆయన తరఫు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న విషయం ఆసక్తికరంగా మారింది.