టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు తరఫున లాయర్లు నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ ఈ రోజు వెకేషన్ బెంచ్ జడ్జి జస్టిస్ జ్యోతిర్మయి ముందుకు వచ్చింది. అయితే, అనూహ్యంగా న్యాయమూర్తి జ్యోతిర్మయి నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ పిటిషన్ విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది.
ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని జస్టిస్ జ్యోతిర్మయి ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాలకు తన ఉత్తర్వులు అడ్డురావని తెలిపారు. 29 వరకు హైకోర్టుకు దసరా సెలవులు. 30వ తేదీన కోర్టు మళ్లీ మొదలు కాబోతోంది. సోమవారం నాడు చంద్రబాబు పిటిషన్ ఏ బెంచ్ కు అప్పగించాలో హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారు. చంద్రబాబు కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ఆయనకు మధ్యతర బెయిల్ కోరిన సంగతి తెలిసిందే.