ఏపీ సీఎం చంద్రబాబు.. ఖచ్చితంగా రెండు మాసాల కిందట ఇచ్చిన బలమైన హామీని అంతే నమ్మకంగా నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి .. నిరుద్యోగ యువతకు చంద్ర బాబు ఎన్నికలకు ముందు పెద్ద హామీనే ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) వేస్తామని చెప్పారు. అంతేకాదు.. తాను ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత..తొలి సంతకం దీనిపైనే ఉంటుందని కూడా చెప్పారు.
చంద్రబాబు ఇచ్చిన ఈ మెగా హామీ ఒకరకంగా.. టీడీపీ కూటమి పార్టీలకు కురిసిన ఓట్ల వర్షానికి దోహద పడింది. రాష్ట్రంలోని జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నారు. నిజానికి గతంలో జగన్ కూడా 2019లో మెగా డీఎస్సీ హామీపైనే ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అప్పట్లోనూ ఆయన మెగా డీఎస్సీ వేస్తామని.. ఒక్క టీచరు పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఐదేళ్ల ఆయన పాలనలో ఒక్కటంటే ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు.
చివరిలో ఎన్నికలకు నాలుగు మాసాల ముందు మాత్రమే మూడు వేల పోస్టులతో జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది పెను దుమారానికి దారి తీసింది. దీనిలో కొన్ని నిబంధనలు మార్చడంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా.. ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇంతలో నిరుద్యోగులు చంద్రబాబును ఆశ్రయించి.. తమ వేదన చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు.
దీంతో స్పందించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే.. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థిలోకం అంతా.. టీడీపీకిసానుకూలంగా స్పందించింది. పలితంగా కనీవినీ ఎరుగని మెజారిటీలు దక్కాయి.
తాజా నిర్ణయం మేరకు.. ఏయే పోస్టులు ఎన్నెన్నంటే..
మొత్తం పోస్టులు 16,347
ఏసీటీ : 6,371
పీఈటీ : 132
స్కూల్ అసిస్టెంట్స్: 7725
టీజీటీ: 1781
పీజీటీ: 286
ప్రిన్సిపల్స్: 52