టీడీపీ అధినేత చంద్రబాబు కు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. 2 గంటలపాటు శ్రమించిన వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తన నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. చంద్రబాబు ఆపరేషన్ నేపథ్యంలో ఆయనను చూసేందుకు టీడీపీ కార్యకర్తలు భారీగా ఆస్పత్రి వద్దకు వచ్చారు. సోమవారం నాడు ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చర్మ సంబంధిత చికిత్స తీసుకున్న చంద్రబాబు ఈ రోజు ఆపరేషన్ చేయించుకున్నారు.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 22వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అయితే, మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబును ఏ కేసులోనూ ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయబోమని ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు. దీంతో, ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేసుకుంది.
ఇక, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరో నిందితుడైన సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ కు సుప్రీం కోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు కాగా..తాజాగా పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఏ 35గా ఉన్న సత్యభాస్కర్ కు పూర్తిస్థాయిలో బెయిల్ రాగా ఏ 38 అయిన చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రాలేదు.