వచ్చే 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రాథమిక మేనిఫె స్టోను ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికలపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. వైసీపీకి దీటుగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని కొందరు.. తగ్గిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అననూహ్యంగా చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించడంతో ఎన్నికల అంచనాలు తారుమార య్యే పరిస్థితి ఉంది.
ఇదిలావుంటే..ఇక, ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రజలు వైసీపీకి దూరమై.. టీడీపీకి చేరువ అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఖాయం. దీంతో ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధమం గా.. అమరావతి రాజధాని పట్టాలెక్కుతుంది? దీంతో కార్మికులకు ఉపాధి లభించడంతోపాటు.. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. ఇసుక ను మళ్లీ ఉచితంగా ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
ఇదే జరిగితే.. భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలోనూ ఆదా యం వస్తుంది. ఇక, విదేశీ పెట్టుబడులు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్న సంస్థలు ఏపీలోనే ఉండనున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ఇమేజ్‌తో పెట్టుబడి దారులు ఏపీకి క్యూ కట్టే అవకాశం ఉంటుంది. తద్వారా.. ఏపీలో పరిశ్రమలు.. ఐటీ వంటివి ఖచ్చితంగా పుంజుకుంటాయి.
ఇలా మొత్తంగా.. ఏపీలో పెట్టుబడులు పెంచడం.. రియల్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సంపద ను పెంచే కార్యక్రమాలకు చంద్రబాబు పెద్దపీట వేయానున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మొత్తంగా ఇటు పార్టీ.. అటు తన సొంత ఇమేజ్ను వినియోగించి.. చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం ద్వారా.. అభివృద్ది బాటలో రాష్ట్రం పుంజుకునేలా చేస్తారని.. పెరిగిన సంపదను ప్రజలకు పథకాల రూపంలో ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.