వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. మాధవ్ న్యూడ్ వీడియో మ్యాటర్ లో వైసీపీ అధినేత జగన్ ఏ చర్యలు తీసుకోకపోవడం, ఆ వీడియో నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని, అందుకు తొందరేమీ లేదని సజ్జల వంటి లీడర్లు చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాధవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు.
జగన్ అలసత్వం వల్లే వైసీపీ పాలనలో ఊరికొక ఆంబోతు తయారవుతున్నాడని మాధవ్ ను ఉద్దేశించి మండిపడ్డారు. ఈ ఆంబోతులు బట్టలిప్పేసి తిరుగుతుంటే మనం చూస్తూ ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన వాళ్లను చూడలేదని, సిగ్గున్నవాడైతే ఇలాంటి పనిచేసి బయట తిరగరని మాధవ్ పై విమర్శలు గుప్పించారు. పైగా, సిగ్గులేని వారంతా రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆ సిగ్గులేనివాళ్లు మళ్లీ కులం, మతం, ప్రాంతం అని అన్నదమ్ములా కలిసుంటున్న ప్రజల మధ్య చిచ్చుపెడతారని అన్నారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో చేస్తుంటారని వెల్లడించారు.
పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఇటువంటి వారిని శిక్షించాలని, అపుడే మిగతా నేతలకు భయముంటుందని అన్నారు. కానీ, జగన్ వారిని ఏమీ చేయకపోవడంతో కీచకుల మాదిరిగా మహిళలపై పడుతున్నారని అన్నారు.
వారంతా భయం లేకుండా, ఇష్టానుసారం ఆడబిడ్డలపై పడే పరిస్థితి రావడానికి కారణం జగన్ అని అన్నారు. ఏం చేసినా జగన్ ఏమీ అనడు అనే ధైర్యం వారికి వచ్చిందని, మా ముఖ్యమంత్రి ఏమీ అడగడన్న భరోసాతో రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు. మేం ఆంబోతుల మాదిరిగా తిరుగుతామని వైసీపీ నేతలంటున్నారని, కానీ, ఆ ఆంబోతులను కట్టడి చేసే శక్తి టీడీపీకి ఉందని అన్నారు. ఇలాంటివాళ్లను వదిలిపెట్టేది లేదని, ఊళ్ల మీదపడి దౌర్జన్యాలు, కబ్జాలు, అత్యాచారాలు చేస్తారా? కేసులు పెడతారా?” అంటూ మండిపడ్డారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన చూడలేదు – @ncbn . #DirtyJGang pic.twitter.com/bsMtirx1az
— iTDP Official (@iTDP_Official) August 9, 2022