స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో దానిని చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో సవాల్ చేశారు. తాజాగా నేడు ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 17 కు హైకోర్టు వాయిదా వేయడంతో చంద్రబాబుకు మరోసారి చుక్కెదురైనట్లయింది. ఇక, ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంగళ్లు అల్లర్ల కేసులో ఈ రోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది.