ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలపై దాడి కొనసాగుతూనే ఉంది. టీడీపీ వారి కేసుల్లో 5 నిమిషాల్లే వారిని ఇరికించే సత్తా ఉన్న ఏపీ పోలీసులు … ఇంతవరకు ఆలయాల దాడి కేసుల్లో నిందితులను పట్టుకోలేదు. ఆ ధైర్యంతోనే దుండుగులు హిందు ఆలయాలపై దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో మరో ఘోరానికి తెగబడ్డారు. స్థానిక బోడి కొండపై ఉన్న 3వ శతాబ్దం నాటి అత్యంత పవిత్రమైన కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం నుంచి తలను వేరు చేసి అక్కడే తుప్పల్లో పడేశారు. ఎంతో ప్రాశస్తం ఉన్న ఈ ఆలయంలో ఇలాంటి ఘోరం జరగడంపై రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో ఎన్నడూ జరగనివి జగన్ అధికారంలోకి వచ్చాక జరగడమే అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఎంపీ రఘురామరాజు నిందితులను వెంటనే పట్టుకోమని, లేకపోతే తదుపరి చాలా పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. మీ సవాంగన్నకు చెప్పి నిందితులను 48 గంటల్లో పట్టుకోమనండి… లేకపోతే మామూలుగా ఉండదు. ఒకవైపు ఎన్నో దశాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం కల సాకారం చేస్తే జగన్ ఇక్కడ హిందు ఆలయాల విధ్వంసాన్ని ఆపలేకపోతున్నారన్నారు.
ఆలయాలపై దాడులు అలవాటుగా మారిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగలను వెంటనే పట్టుకోవాలని విజయనగరం జిల్లా బీజేపీ చీఫ్ పావని డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా నాయకులు రవిశంకర్ సహా పలువురు నేతలు ఆలయం వద్ద ఆందోళనలను చేపట్టారు.
విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై కోదండరాముడి విగ్రహం ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక పథకం ప్రకారమే ఏపీ లో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అంతర్వేది, బిట్రగుంట ఆలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే దుండగులను పట్టుకుని చర్యలు తీసుకుని ఉంటే… ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావన్నారు. జగన్ పాలనలో మనుషులకే కాదు, దేవాలయాలకు, దేవతా విగ్రహాలకు కూడా భద్రత లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.