ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు కు ఏసీబీ కోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసులో చంద్రబాబుకు పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. పీటీ వారంట్ కు అనుమతించిన కోర్టు సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, శుక్రవారం నాడు స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశముందని చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో, ఆ తీర్పు వస్తే పీటీ వారెంట్ విషయంలో జోక్యం చేసుకోవచ్చని లాయర్లకు జడ్జి సూచించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదించారు. దీంతో, చంద్రబాబును రెండోసారి కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరిచే అవకాశాలున్నాయి. మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు శుక్రవారం వెల్లడయ్యే అవకాశముంది.