ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇక, జగన్ పై టీడీపీ ఏకంగా బాదుడే బాదుడు పేరుతో భారీ క్యాంపెయిన్ కు తెరతీసింది. జనం నడ్డి విరిచేలా జగన్ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీల పెంపు వంటి విషయాలను జనంలోకి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభం దిశగా సాగుతోందని, జగన్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బాదుడే బాదుడులా సాగుతున్న జగన్ సర్కారు మెడలు వంచేందుకు టీడీపీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ సర్కారు దోపిడీని ప్రశ్నించాలని పెంచిన ధరలు, పన్నులతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మండిపడ్డారు.
ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ దీనికి అదనమని, జగన్ విధానాలతో ప్రతి కుటుంబంపై ఏడాదికి హీనపక్షం రూ.1 లక్ష భారం పడుతోందని చంద్రబాబు గణాంకాలతో సహా విశ్లేషించారు. జగన్ బాదుడేబాదుడుతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.తాను చేసే అప్పుల కోసం ప్రజల జేబులను జగన్ ఖాళీచేయిస్తున్న వైనాన్ని ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పథకాల పేరుతో ప్రజల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జగన్ తన జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ ప్రకారం సెటైర్లు పేలుస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిు. అంతకుముందు, జగన్ ఉచిత పథకాలు, పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచిపెడుతున్నా వైనానికి ఏపీ మరో శ్రీలంక కాబోతోందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చెప్పిన విషయాన్నే ప్రధాని మోడీ దగ్గర కేంద్ర అధికారులు చెప్పడం విశేషం.