విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ విజయవాడకు రావడానికి తీవ్ర కృషి చేసిన అన్నగారి పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు తొలగింపును టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
చంద్రబాబు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులతోపాటు ఆఖరికి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, జగన్ తీరు మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పేర్ల పిచ్చ మరోసారి వివాదాస్పదమైంది.
విజయవాడలోని ప్రఖ్యాత ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’లో తుమ్మలపల్లి, క్షేత్రయ్యల పేర్లను తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శల పాలైంది.
జగన్ పై సాహితీప్రియులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పేరు మార్పుపై చంద్రబాబు కూడా నిప్పులు చెరిగారు. ఆ కళాక్షేత్రానికి స్థలం ఇచ్చిన దాత తుమ్మలపల్లి శ్రీహరి గారి పేరు, వాగ్గేయకారుడు క్షేత్రయ్య పేరును తీసేశారని ఆయన మండిపడ్డారు. కళాక్షేత్రానికి కూడా ఏ దోపిడీదారుడి పేరో పెడతారనుకుంటా జగన్ కు చురకలంటించారు. ఇలా అన్నింటికి పేర్లు, రంగులు మార్చడం ఆయనకున్న జబ్బేమో అంటూ సెటైర్లు వేశారు.