రాష్ట్రంలో జరుగుతున్న అరాచక హింసాత్మక ఘటనలపై చంద్రబాబు స్పందించారు. పట్టాభిపై ఈరోజు జరిగిన దాడికి నిరసనగా చంద్రబాబు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం రాష్టంలో లా అండ్ ఆర్డర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మనిషికి రక్షణ కల్పించే రాజ్యాంగ అధినేత పేరు పెట్టిన అంబేద్కర్ కాలనీలోనే లా అండ్ అర్డర్ అనేది లేకుండా పోయింది. పట్టపగలు, ఒక వీఐపీ మీద దుండగులు దాడి జరిగి తప్పించుకోగలిగారు… సాయంత్రం అయినా నిందితులను పోలీసులు పట్టించుకోలేదు అంటే అసలు పోలీసు వ్యవస్థ అనేది పనిచేస్తుందా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
పట్టాభి గతంలోనే తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అపుడు పట్టించుకోలేదు. సెక్యూరిటీ ఇవ్వలేదు. తాజాగా మళ్లీ దాడి చేశారు. ఇపుడు కనీసం నిందితులను పట్టుకోలేదు… డీజీపీ నీకు జీతం ఇచ్చేది జగనా? ప్రజలా? నువ్వు పనిచేసేది వైసీపీ కోసమా? ప్రజల కోసమా? ప్రజల ప్రాణాలకు విలువలేని నాడు నువ్వు నీ సీఎం ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చేసిన మరిన్ని సంచలన వ్యాఖ్యల కోసం ఈ 3 నిమిషాల వీడియో చూడండి.