ఫేక్ చేసేటప్పుడు ఇలాంటి పాత ట్వీట్లు డిలీట్ చేసుకోవాలి కదరా బుజ్జా ఇప్పుడు చూడు అడ్డంగా దొరికి ఎర్రి పుష్పమయ్యావు ???? pic.twitter.com/Lotblrri16
— I Love India✌ (@Iloveindia_007) April 7, 2023
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీసీఎం వైసీపీ అధినేత జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగారు. ‘‘చూడు….జగన్!.. ఇవే టీడీపీ హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు. ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడ?.. జవాబు చెప్పగలవా? ’’ అంటూ జగన్‌కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. తన సెల్‌ఫోన్‌తో టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర.. సెల్ఫీ దిగి చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.
“ఇంకేముంది ఇళ్లు వచ్చేస్తున్నాయ్.. అంటూ పేదలు ఆనందపడ్డారు. అనుకున్నట్టుగానే గృహ నిర్మాణాలు భారీగా సాగాయి.. అను కున్నదానికంటే ముందే గృహాలు ఇచ్చేస్తారని అంతా ఆశించారు. చాలా మంది అప్పులు చేసి మరీ డిపాజిట్లు (Deposits) చెల్లించారు.. తీరా చూస్తే ప్రభుత్వం మారింది.. వైసీపీ అధికారంలోకి వచ్చింది.. నాలుగేళ్లుగా ఇల్లు కలగా మిగిలి పోయింది. నేటికీ ఇళ్లెప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు“ అని బాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్‌కు, లీడర్స్‌కు చంద్రబాబు పిలుపు నిచ్చారు. మరి దీనిని వైసీపీ నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇదిలావుంటే.. తన పాలన గురించి చంద్రబాబు మాట్లాడు తూ.. టెక్నాలజీ అంటే తానే గుర్తుకొస్తానని, తాము తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తెలుగు వారు రాణిస్తున్నారని గుర్తుచేశారు.
ఆ బటన్ నాదగ్గరే ఉంది!
పార్టీ వ్యవస్థను ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లామని చంద్రబాబు ప్రకటించారు. 25 వేల ఓట్ల సామర్ధ్యం పెంచుకునే అవకాశం క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు ఉందని, ఎవరు పొరపాటు చేసినా.. కరెక్ట్ చేసే బటన్ తన చేతిలో ఉందని చంద్రబాబు అన్నారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం స్కూల్ నడుపుతున్నామని తెలిపారు. కార్యకర్తలను గౌరవించే పార్టీ.. నాయకులను గౌరవించే పార్టీ టీడీపీనేనని చంద్రబాబు చెప్పారు. వైసీపీలో పరిస్థితి చూస్తున్నారుగా.. ఎమ్మెల్యేలకు విలువ లేదు.. అక్కడ ఒక నిరంకుశత్వం రాజ్యమేలుతోంది! అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు తండ్రులని చెప్పుకోవటం, "యాక్ ఛీ"…
లండన్ మందులు డోస్ పెంచుకోండిరా బాబు, లేదా డాక్టర్ ని మార్చండి. (2/3)#YcpFakeBrathuku#PsychoPovaliCycleRavali #IdhemKarmaManaRashtraniki #JaganPaniAyipoyindhi#JaganFailedCM pic.twitter.com/AWZfkUJjSS— Telugu Desam Party (@JaiTDP) April 8, 2023