భారత దేశ రాజకీయ చరిత్రలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించిన అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ దార్శనీకుడు చంద్రబాబు. తెలుగునాట ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.
ఐటీ రంగంలో చంద్రబాబు విశేష కృషికి నిలువెత్తు తార్కాణం హైటెక్ సిటీ. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉధ్యోగాలు, ఐటీ రంగంలో ఏటా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, యువత కలలుగనే స్టార్టప్ లు ఈరోజు సాధ్యమవుతున్నాయంటే ఆనాటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1998లో ఆనాటి ప్రధాని, దివంగత నేత, రాజకీయ చాణక్యుడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీదుగా ప్రారంభమైన హైటెక్ సిటీ నేడు భారత దేశం గర్వించదగ్గ ఐటీ హబ్ గా నిలిచింది.
Remembering Bharat Ratna, former PM Atal Bihari Vajpayee Ji on his Death anniversary.. pic.twitter.com/BjvhVSoJ3h
— iTDP Official (@iTDP_Official) August 16, 2022
ఈ క్రమంలోనే నేడు వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు వాజపేయి అని, ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అని కొనియాడారు. భారతరత్న వాజపేయి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.
వాజపేయి గారి పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం… భాగస్వామి కావడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశం అని అన్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని, ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రశంసించారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడు శ్రీ వాజపేయి అని అన్నారు. పబ్లిక్ పాలసీలతో లబ్ది పొందిన ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆనాడు వాజపేయితో కలిసి హైటెక్ సిటీని చంద్రబాబు ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 23 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ ప్రాంతం ఎలా ఉండేదో…ఇపుడు ఎలా ఉండేదో తేడా చూపుతున్న ఫొటో వైరల్ గా మారింది.
Comments 1