వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అన్నింటికీ సిద్ధంగానే ఉన్నారని పార్టీ సీని యర్ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందు కు సాగాలనేది చంద్రబాబు వ్యూహం. ముఖ్యంగా బీజేపీతోనే ఎందుకు వెంపర్లాడుతున్నారనేది కూడా అందరికీ తెలిసిందే. నిజానికి ఏపీలో బీజేపీకి అంత సత్తా లేదు. కనీస ఓటు బ్యాంకు కూడా లేదు.
అయినా.. టీడీపీ ఎదురు చూపులు కేంద్రంలో ఉన్న అధికారాలతో ఏపీలో వైసీపీ ఆగడాలను నిలువరి స్తుందనే! అందుకే.. బీజేపీతో పొత్తుల కోసం చూస్తోంది. అయితే.. ఇప్పటి వరకు గత రెండేళ్లుగా కూడా బీజేపీ ఈవిషయాన్ని నాన్చుతూనే ఉండడం గమనార్హం. తాజాగా కూడా.. పవన్ రాయబారం ఏమాత్రం ఫలించినట్టుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు టీడీపీ సీనియర్లు ఆఫ్ ది రికార్డుగా రియాక్ట్ అయ్యారు.
“మేం అన్నింటికీ రెడీగానే ఉన్నాం. పొత్తులు ఉంటే.. బాగుంటుందని చెబుతున్నాం. దీనివల్ల మా ఓటు బ్యాంకునే మేం నష్టపోతాం. ఒకవేళ పొత్తులు లేకపోయినా.. ముందుకు వెళ్తాం. అందుకే మా నాయకుడు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు పెట్టుకున్నారు. ఈ సారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా మేం అంతా పనిచేస్తున్నాం. పొత్తుల విషయం తేలితే.. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం` అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక కీలక నేత వ్యాఖ్యానించారు.
ఇక, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని గమనించినా.. చంద్రబాబు కూడా మానసికంగా.. రెడీగానే ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నారు. పొత్తులు ఉన్నా..లేకున్నా.. టీడీపీని పరుగులు పెట్టించాలనే వ్యూహంతోనే బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ల పర్యటనలు చేస్తూనే నాయకులను గాడిలో పెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. అదేవిధంగా సీట్లు కూడా కేటాయిస్తున్నారు. ఇవన్నీ చూస్తే.. వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు లేకపోయినా.. పార్టీని గెలిపించాలనే కసి.. చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.