ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎదుర్కొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు లు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరీముఖ్యంగా.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో తనను పర్యటించకుండా అడ్డుకున్న వైనం.. తన చైతన్య రథాన్ని స్వాధీనం చేసుకుని మూడు రోజులైనా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన వైనాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు.. ఈ విషయాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు… దీనిని ప్రజా ఉద్య మంగా మార్చాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఎందుకంటే.. 14 ఏళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన తనకే ఇంత అవమానం జరిగితే.. మిగిలిన పార్టీలు, నాయకుల పరిస్థితి ఏంటనేది.. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలో జీవో 1పైనే కాకుండా.. అసలు పోలీసుల తీరుపైనా ఆయన ఉద్యమించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అయితే, దీనికి బీజేపీతప్ప.. ఇతర పార్టీలుకలిసివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. జీవో 1 అనేది అన్ని పార్టీలూ.. ప్రజాసంఘాలు కూడా తప్పుబడుతున్న విషయం. సో.. తమకు ఉన్న స్వేచ్ఛ, ఉద్యమాలు చేసుకునే అధికారం లేకుండా పోయిందనేది వారి బాధ. ఈ నేపథ్యంలో వారిని కూడగట్టి.. త్వరలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదేసమయంలో న్యాయపోరాటానికి కూడా రెడీ అవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జీవో 1 చట్టబద్ధతను తేల్చేందుకు హైకోర్టును ఆశ్రయించేలా.. ప్రయత్నాలు సాగుతున్నాయని.. పార్టీ వర్గాలు అంటున్నారు. తద్వారా.. త్వరలోనే ప్రారంభం కానున్న టీడీపీ కీలక పాదయాత్రకు అడ్డంకులు తప్పించా లని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.