నరాలు తెగే ఉత్కంఠగా మారిన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ సీటుకు టీడీపీ క్యాండెట్ ఎవరు ? అవుతారు అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు చంద్ర బాబు రెండో లిస్టులో తెరదించేశారు. ప్రస్తుత ఇన్చార్జ్ మద్దిపాటి వెంకట్రాజుకే సీటు ఖరారు చేశారు. ఇదే సీటు కోసం పోటీపడ్డ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు పక్కనే ఉన్న కొవ్వూరు సీటు కన్ఫార్మ్ చేశారు. చంద్రబాబు మద్దిపాటి, ముప్పిడి విషయంలో చాలా సమన్వయంతో ఇద్దరికి సీట్లు ఇచ్చి న్యాయం చేశారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు.. రెండు వర్గాలకు న్యాయం చేశారు.
ముళ్లపూడికి న్యాయం.. శిష్యుడిని గెలిపించే పెద్ద బాధ్యత :
గోపాలపురం సీటు విషయంలో కాస్త తర్జనభర్జనలు జరిగాయి. ఇక్కడ మద్దిపాటికి ఇస్తే పార్టీనే నమ్ముకుని ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడికి అన్యాయం జరుగుతుందని ఓ వర్గం పట్టుబట్టింది. చంద్రబాబు ఇద్దరికి న్యాయం చేయడంతో ఇప్పుడు గోపాలపురంలో రెండు వర్గాలు కలిసికట్టుగా పనిచేసి మద్దిపాటిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పైగా ఇక్కడ వైసీపీ నుంచి హోం మంత్రి తానేటి వనితో పోటీలో ఉండడంతో టీడీపీ యంగ్ ఎనర్జిటిక్ మద్దిపాటి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో గోపాలపురం రేసు సహజంగానే రసవత్తరంగా మారబోతోంది.
ముప్పిడి, మద్దిపాటికి సీట్లు ఖరారు అయ్యాయి. ఇక గోపాలపురం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్న జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు తన శిష్యుడు వెంకటరాజును గెలిపించే పెద్ద బాధ్యత చంద్రబాబు అప్పగించారు. బాపిరాజుకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారు. 2009లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రబాబు.. 2014లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీచైర్మన్ పదవి కట్టబెట్టారు.
ఇక 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చేందుకు ఈక్వేషన్లు కుదరలేదు. ఈ క్రమంలోనే మెట్ట నియోజకవర్గాల్లో బాపిరాజు కీలకం కానుండడంతో ఆయనకు 2024 ఎన్నికల తర్వాత కీలకమైన పదవి కట్టబెట్టేలా బాబు క్లీయర్‌గా ఉన్నారు. జిల్లాలు డివైడ్ అవ్వడంతో అది తూర్పుగోదావరి జడ్పీచైర్మన్ పదవా ? లేదా ఎమ్మెల్సీయా ? లేక మరో పదవా ? అన్నది తెలియరాలేదు కాని.. మంచి పదవి ఇస్తానని బాబు చెప్పినట్టు తెలిసింది.
ఇక ఇప్పుడు బాపిరాజు మెట్ట నియోజకవర్గాల్లో తనకున్న పట్టుతో పాటు సొంత నియోజకవర్గం గోపాలపురంలో తన శిష్యుడు వెంకట్రాజును భారీ మెజార్టీతో గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకోవాలి. బాపిరాజు శిష్యుడిగానే గోపాలపురం రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టిన వెంకట్రాజు ఎట్టకేలకు పదేళ్ల కష్టం తర్వాత సీటు దక్కించుకున్నారు. ఏదేమైనా గోపాలపురం నియోజకవర్గం నుంచే ఇద్దరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు రావడంతో అన్నీ గురి కుదిరితే గోపాలపురంలో టీడీపీ కనీవినీ ఎరుగని మెజార్టీతో గెలవడం పక్కా..!