దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర పున:ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని తాటిపాక సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు హాజరయ్చయారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. తనపై 6 కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని, చంద్రబాబును అరెస్టు చేసి అడ్డంకులు సృష్టించినా యువగళం పాదయాత్రను అడ్డుకోలేర అన్నారు. చంద్రబాబుపై తర్వాతి కేసు అన్నా క్యాంటీన్ కు సంబంధించి అని, స్కిల్ కేసులో ఒక్క ఆధారం చూపలేదని అన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని మండిపడ్డారు. కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం మొదలైందని, సైకో జగన్‌కి ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని జోస్యం చెప్పారు. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అవుతారని చెప్పారు. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలని ప్రజలను కోరారు.
ఏ తప్పూ చేయని చంద్రబాబును, తనను కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, రూ.43 వేల కోట్ల ప్రజాధనం దొబ్బిన పిచ్చోడిని ఏం చెయ్యాలని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా డాన్ గా మారిన పిచ్చోడు 3 నెలల్లో పర్మినెంట్ గా జైలుకి పోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలందరూ జైలుకెళ్లడం పక్కా అని, అక్కడ వారి తాట తీసే జైలర్ చంద్రబాబేనని హెచ్చరించారు.
Mood of the State#YuvaGalamJoshBegins#YuvaGalamPadayatra#LokeshPadayatra#NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/B5IVANBYs3
— Telugu Desam Party (@JaiTDP) November 27, 2023