కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వరూపం చూపించారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని అడ్డుకుంటూ తనవైపు అసభ్యకర సైగలు చేసిన ఓ వైసీపీ కార్యకర్తను చంద్రబాబు గుర్తించారు. రారా చూసుకుందాం అంటూ అతడికి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు విశ్వరూపాన్ని చూసి పారిపోయిన అతడిని పట్టుకోవాలంటూ టీడీపీ కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు నిద్రపోతున్నారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా ఇంటి మీదకు, మా పార్టీ కార్యాలయం మీదకు దాడికి వస్తార్రా…అంటూ చంద్రబాబు మండిపడ్డారు. రండిరా చూసుకుందాం…అంటూ మునుపెన్నడూ లేని రీతిలో చంద్రబాబు ఉగ్రరూపం చూపించారు. వాస్తానికి చంద్రబాబు ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడం చూసి పక్కనున్న టీడీపీ నేతలే షాకయ్యారు. తన సహనం చచ్చిపోయిందని, ఇకపై మాటకు మాట…దెబ్బకు దెబ్బ అన్న రీతిలో చంద్రబాబు మాట్లాడారు.
పోలీసులు ఎందుకు..అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. వారు కూడా యూనిఫాం విప్పేయాలంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, కర్నూలు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో, సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ అని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సభలో ప్రసంగించిన చంద్రబాబు… పేటీఎం బ్యాచ్ కు బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపారని మండిపడ్డారు. రాయలసీమలో ముఠా నేతలను అణచివేసిన పార్టీ టీడీపీ అని,మిమ్మల్ని అణచివేయడం ఓ లెక్కా! అని ఫైర్ అయ్యారు. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాను… మీ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
???????? ఆయనలో ఒక్క కోణం మాత్రమే చూసారు ఇన్ని రోజులు. ????????
1/3 pic.twitter.com/L0fZnmJ0Cp— anigalla???????? (@anigalla) November 18, 2022