రాష్ట్రంలో చండాలమైన లిక్కర్ పాలసీ వల్ల విచ్చలవిడిగా అమ్ముతున్న కల్తీ మద్యంతో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దల అండతో దేశమంతటికి ఏపీని గంజాయి రాజధానిగా మార్చేశారు … అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు.
ఈ అరాచకాలపై వెంటనే స్పందించి జనం పోరాడకపోతే భవిష్యత్తు అనేది లేకుండా పోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. పోనీ అఘాయిత్యాలు జరిగిన తర్వాత అయినా నిందితులపై చర్యలు ఉండటం లేదు. బాధితులకు న్యాయం జరగడం లేదు అని చంద్రబాబు విమర్శించారు.
మీకు చిత్తశుద్ధి ఉంటే ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగినపుడు వెంటనే స్పెషల్ ఫోర్స్ తో వెతికి పట్టుకుని శిక్షించేవారు. కానీ అదేమీ జరగడం లేదు.
జగన్ రెడ్డి సొంత బ్రాండ్ల మద్యం, విచ్చలవిడి డ్రగ్స్ వాడకం వల్లే ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. – @ncbn#APUnsafeforWomen pic.twitter.com/YKlSvZwgPX
— Telugu Desam Party (@JaiTDP) April 22, 2022
మానసిక దివ్యాంగురాలిని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో బంధించి సామూహిక అత్యాచారం చేశారంటే…రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణలేదని తేలిపోయింది. అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అవమానం- @ncbn#APUnsafeforWomen pic.twitter.com/rTkydxSYCG
— Telugu Desam Party (@JaiTDP) April 22, 2022