స్కిల్ స్కాం ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్ర బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ రిపోర్టు రోజూ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అన్ని నార్మల్ గా ఉన్నట్లుగా రిపోర్టు చెబుతోంది. అయితే.. ఆయన బరువు తగ్గారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ.. రోజు వారీ నివేదికలో మాత్రం ఆయన బరువు కాలమ్ ను తీసేయటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. రోజు వారీగా విడుదలయ్యే రిపోర్టులో పేర్కొని అంశాలు.. తాజాగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందించిన నివేదికను కోర్టు ద్వారా అందుకున్న వేళ.. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. చంద్రబాబు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఎన్ని అన్న విషయంపై స్పష్టత వస్తుందని చెప్పాలి.
స్కిన్ అలర్జీ కారణంగా కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఒంటి మీద దద్దుర్తు వ్యాపించటంతో నొప్పి.. ఇతరత్రా ఇబ్బందులకు గురి కావటం తెలిసిందే.
మందులతో పాటు చల్లటి వాతావరణం అవసరమన్న వైద్యుల సూచన మేరకు జైల్లో ఏసీ సౌకర్యాన్ని కల్పించటం తెలిసిందే. అయితే.. బాబు ఒంటి మీద ఉన్న దద్దుర్ల సమస్య మాత్రం తగ్గలేదని పేర్కొంటున్నారు. విరేచనం వచ్చే ప్రాంతంతో పాటు.. వెన్నుకింద భాగంలోనూ నొప్పితో ఇబ్బందులకు గురవుతున్న విషయం తాజా నివేదికలో వెల్లడించారు.
చంద్రబాబు శరీరంపై ఇంకా దద్దుర్లు ఉన్నాయని.. సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు చల్లటి వాతావరణం కంటిన్యూ చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. వెన్ను కింద భాగంలో నొప్పి.. విరేచనం కాకపోవటం అంటే.. ఒంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడే అలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకు భిన్నంగాఅలా వదిలేస్తే.. షిపర్ లాంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
జైల్లో చంద్రబాబును టెస్ట్ చేసిన వైద్యులు పూర్తి రక్త పరీక్ష.. కిడ్నీ.. లివర్ పరీక్షలతో పాటు గడిచిన మూడు నెలల సగటును తెలిపే షుగర్ టెస్టుతో పాటు.. ఛాతీ ఎక్స్ రే.. 2డి ఎకో లాంటి పరీక్షలకు సిఫార్సు చేశారు. రక్తం గడ్డ కట్టే సమస్య గురించి తెలుసుకోవటానికి పరీక్షలు అవసరమని చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు ఆరోగ్యం ఓకే అన్న దాని కంటే నాట్ ఓకే అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసేలా రిపోర్టు ఉందంటున్నారు.