విజయవాడలోని ఏ కనెక్షన్ లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిలతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరఫున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏపీ మఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటున్నామని ఆయన పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధరేశ్వరి గారు, అచ్చెన్నాయుడు బలపరిచారు.
అంతకుమందు, టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ శాసన సభా పక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబును అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా…134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత టీడీపీ బృందం.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయనకు ఒక వినతి పత్రం అందించనున్నారు. దీంతో లాంఛనంగా గవర్నర్ కూటమి పార్టీల నాయకత్వాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. ఇక, బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నా యకులు కూడా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అదిరిపోయేలా చేస్తున్నారు. మరోవైపు.. ఇత ర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి విజయవాడలో బస ఏర్పాట్లు చేస్తున్నారు. 100 మంది ప్రత్యేక అతిథులకు ప్రముఖ హోటళ్లలో బసకు రూమ్‌లు బుక్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే అతిథులు, విశిష్ట అతిథులకు మర్యాదలు చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీల సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు.