తెలుగు సినిమాలో తనదైన ముద్ర వేసిన కృష్ణం రాజు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. సీనియర్ నటులు కృష్ణంరాజు గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు భార్యకు ఆయన ధైర్యం చెప్పారు.