ఏపీలో పోలింగ్ మరి కొన్ని గంట్లో మొదలు కాబోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఫేక్ వీడియో, ఫేక్ ఆడియో వైరల్ గా మారింది. పథకాలు లేవు ఏమి లేవు అంటూ చంద్రబాబు మాట్లాడినట్టుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, చంద్రబాబు ఓ ఇంటర్ల్యూలో చెప్పిన మాటలను మార్ఫింగ్ చేసి మరో ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫేక్ ఆడియో, వీడియో పై చంద్రబాబు స్పందించారు. ఓటమి భయంతో ఇటువంటి ఫేక్ ఆడియోలు, వీడియోలు విడుదల చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి… త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా… అంటూ తన వాయిస్ తో ఈ మెసేజ్ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు.
“ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి” అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
గతంలో తాను మాట్లాడిన వీడియో ఆధారంగా మరో ఫేక్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సర్కులేట్ చేస్తున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆ క్రమంలోనే గతంలో తాను మాట్లాడిన ఒరిజినల్ వీడియోతోపాటు ఫేక్ వీడియోను కలిపి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటువంటి ఫేక్ ఆడియోలు వీడియోలను నమ్మొద్దని ఓటర్లకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ఏపీకి ఓటు వేసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రానికి తరలివస్తున్న ప్రజలు సరైన బస్సు సర్వీసులు లేక నానా ఇబ్బందులు పడుతున్న అంశంపై చంద్రబాబు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు చంద్రబాబు ఫోన్ చేశారు. అదనపు బస్సు సర్వీసులను నిర్వహించాలని, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. ఈ క్రమంలోనే స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 40 మంది ప్రయాణికులు కలిసి ఒక బస్సును బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేక బస్సులను, సర్వీసులను నడుపుతున్నామని వెల్లడించింది.
ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు… pic.twitter.com/tZKOHxnTsn
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2024