ఏపీ అధికార పక్షాన్ని టీడీపీ నాయకులు.. తరచుగా .. కౌరవులు కౌరవులు అంటూ ఉంటారు.
ఇవన్నీ సహజం ఎందుకంటే.. వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్.
పైగా 151 మంది ఎమ్మెల్యేలు.. ఉన్నారు. కాబట్టి.. టీడీపీ నేతలు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు.. నిజంగానే తాము కౌరవులమేనని నిరూపించే పనిచేశారు.
నిండు సభలో.. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేక కావొచ్చు.. లేదా.. మరింతగా రెచ్చగొట్టే ధోరణితో కావొచ్చు.. ఏకంగా.. ఆయన సతీమణిని కూడా.. రొచ్చులోకి లాగారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు. అనరాని మాటలు అన్నారు. దీంతో ఒక్కసారి గా నిశ్చేష్టులైన చంద్రబాబు.. కన్నీటి పర్యంత మయ్యారు. ఆగ్రహావేశాలకు గురయ్యారు.
అంతేకాదు.. ఇది కౌరవ సభా .. గౌరవ సభా ? అంటూ.. నిలదీశారు. అయితే.. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం.. మైకును కట్ చేశారు.
దీంతో టీడీపీనాయకులు మరింత ఆవేదనకు గురయ్యా రు. దీంతో చంద్రబాబు తీవ్ర శపథం చేశారు.
తను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిస్తేనే సభలోకి అడుగుపెడతా నని అన్నారు. ఆ వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు.
అయితే.. ఈ పరిణామంపై.. నెటిజన్ల నుం చి సాధారణ పౌరుల వరకు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లో సీనియర్.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి.. రాష్ట్ర అభ్యున్నతి కోసం.. కృషి చేసిన.. చంద్రబాబును అవమానించడమే కాకుండా.. ఆయన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగుతారా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు.
చంద్రబాబు కన్నీరుతో వైసీపీ పతనం ప్రారంభమైనట్టేనని.. శాపనార్థాలు పెడుతున్నారు. వైసీపీకి మూడిందని.. వైసీపీ నాయకులు వారి పతనాన్ని వారే కొనితెచ్చుకుంటున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం.. వైసీపీకి ఎలాంటి లాభం చేయకపోగా.. తీవ్ర నష్టం చేయడం ఖాయం.
ఎందుకంటే.. రాష్ట్ర ప్రజల నాడిని చూస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై వారికి ఎలాంటి వ్యతిరేకతా లేదు.
కేవలం క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు చేసిన దూకుడు కారణంగా, మరోవైపు.. ఒక్కఛాన్స్ అంటూ.. పాదయాత్ర చేసిన జగన్పై సింపతీతోను.. గత ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో నిలిచిందే తప్ప.. చంద్రబాబుపై వ్యతిరేకత లేదు. ఆయనను ఇప్పటికి విజన్ ఉన్న నాయకుడిగా .. అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకుంటూనే ఉన్నాయి.
అలాంటి నాయకుడిని రోదించేలా చేసిన.. వైసీపీపై నిజంగానే జనాలు వ్యతిరేకత పెంచుకోవడం ఖాయమని .. మేధావులు కూడా అంటున్నారు.
This is a topic that is close to my heart…
Many thanks! Exactly where are your contact details though?