తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సభ సందర్భంగా జనసేన, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు తమ వ్యాఖ్యలతో పాటు హావభావాలు, ఆలింగనాలతో కూడా పొత్త ధర్మం ఎలా నిలబెట్టుకోవాలో చెప్పకనే చెప్పారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు గౌరవం , అభిమానం ఎలా కలిగి ఉండాలో చూపించారు.
వైసీపీ అరాచక, విధ్వంస వైసీపీ పాలన అంతమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి నిర్వహించిన ఈ సభ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇరు పార్టీ అధినేతలు చిరునవ్వులు చిందిస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఇంతే సంతోషంగా ఉండాలని ముందుకుపోతున్నారు. ఇరువురు నేతలు చేతులు పైకెత్తి విజయసంకేతం చూపిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. ఇక, ఒకరి పార్టీ జెండాలు మరొకరు పట్టుకొని ఊపుతూ కార్యకర్తల్లో సమరోత్సాహం నింపుతుున్న ఫొటోలు వైరల్ గా మారాయి.