• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘చాందినీ దువ్వూరి’ కి ‘వంగూరి చిట్టెన్‌ రాజు’ మద్దతు

16 సంవ‌త్స‌రాలుగా 'తానా' సేవ‌లో విశేష కృషి II మ‌హిళ‌ల అభ్యున్న‌తికి ఎన‌లేని సేవ‌లు.. II

admin by admin
April 28, 2021
in TANA Elections
0
0
SHARES
232
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఎన్నిక‌ల్లో ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్(2021-23) ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు.. చాందిని దువ్వూరి. సుదీర్ఘ కాలంగా ‘తానా’తో ప్ర‌త్యేక అనుబంధాన్ని పెన‌వేసుకున్న చాందిని దువ్వూరి.. ఇటు ‘తానా’ అభ్యున్న‌తికి అదే స‌మ‌యంలో ఒక మ‌హిళ‌గా.. స‌మాజం లోని మ‌హిళ‌ల అభివృద్ధి, సాథికార‌త‌కు విశేష కృషి స‌ల్పుతున్నారు. అనేక రూపాల్లో ‘చాందిని దువ్వూరి’ చేస్తున్న సేవ‌లు.. స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌ను అభ్యున్న‌తి దిశ‌గా న‌డిపిస్తున్నాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ నేప‌థ్యంలో ‘ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్’ గా బ‌రిలో నిలిచిన ‘చాందిని దువ్వూరి’నకి

ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తగా, రచయితగా పేరు గాంచిన అదే కాకినాడ వాస్తవ్యులు/హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తానా వ్యవస్థాపనలో కూడా కీలకంగా వ్యవహరించిన  శ్రీ ‘వంగూరి చిట్టెన్‌రాజు’గారు అనూహ్యంగా తన పూర్తి మద్దతు ప్రకటించారు.

కాకినాడ వాస్తవ్యరాలు/హ్యూస్టన్‌కు చెందిన తానా మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలైన శ్రీమతి పద్మశ్రీ ముత్యాల

మద్దతు కూడా లభిస్తుందని ఆశిస్తున్నారు

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః

ఎక్కడెక్కడ మహిళలు గౌరవింపబడతారో.. పూజింప‌బ‌డ‌తారో.. అక్కడ దేవతలు నివాసముంటారు. మహళలు గౌరవింపబడని చోట ఎటువంటి శుభాలు కలగవు అని రుషి వాక్కు. మన పెద్దలు మహిళకు గౌరవాన్ని ఇవ్వడంతోపాటు పెద్ద పీట కూడా వేశారు. ఈ స్ఫూర్తిని న‌ర‌నరాన నింపుకొన్న చాందిని దువ్వూరి.. మహిళలకు సమాజంలో సరైన గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, రక్షణ కల్పించేలా మార్పులు తీసుకువచ్చేందుకు త‌న‌వంతు ప్రయత్నం చేస్తున్నారు.

చాందిని సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం!

‘తానా’కు ‘చాందిని దువ్వూరి’ అందిస్తున్న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీలేదు. 16 సంవత్సరాలకుపైగా కమ్యూనిటీ సేవలో కొన‌సాగుతున్నారు. అదేస‌మ‌యంలో 12 సంవత్సరాలకుపైగా మహిళల అభ్యున్న‌తిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ప్ర‌ధానంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలల అభివృద్ధి, యువ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేపట్టారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనా‌ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు నిర్వ‌హించారు.

పేద‌ల‌కు, క‌రోనా బాధితుల‌కు వైద్యసేవలు అందించేలా కృషి చేశారు. అదేస‌మ‌యంలో నిరుపేద‌ల‌కు నిత్యావసర సరకుల పంపిణీ చేప‌ట్టారు. ప‌నులు లేక‌, ఆక‌లితో అల‌మటిస్తున్న వారికి అన్నదానం చేశారు. అదేస‌మ‌యంలో సీనియర్‌ సిటిజెన్స్‌ హోమ్స్‌, పునరావాస కేంద్రాలు, బాలికలను దత్తత తీసుకుని వారిని చదివించడం, వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడం ఇలా.. అనేక రూపాల్లో చాందిని దువ్వూరి.. త‌న సేవ‌ల‌ను విస్తృతం చేశారు.

కోవిడ్‌ సమయంలో వైద్యసేవలకోసం ప్రకాశం జిల్లాలో ఆసుపత్రిని దత్తత తీసుకుని వైద్యసేవలను మెరుగుపరిచారు. లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు 4,000 మందికిపైగా వలస కూలీలకు ప్రతిరోజూ ఆహారం అందించారు. దాదాపు 3,500కు పైగా నిత్యావసర స‌రుకులను నిరుపేదలకు, సేవా సంస్థలకు పంపిణీ చేశారు. 1200మందికిపైగా నేత కార్మికులకు ఆసరా కల్పించారు.

తానా ద్వారా మహిళా కార్యక్రమాలను అన్నీచోట్లా నిర్వహించారు.. యువతను, మహిళలను చైతన్యపరచడం ద్వారా.. స‌మాజంలో వారి పాత్ర‌ను ఇనుమ‌డింప‌జేశారు.. అనేక కార్య‌క్ర‌మాల్లో యువ‌త‌ను, మ‌హిళ‌ల‌ను భాగస్వాములను చేయాలనే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మ‌హిళా సాధికార‌త‌కు విద్య ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని విశ్వ‌సించిన చాందిని దువ్వూరి.. ఆదిశ‌గా మ‌హిళా విద్య‌కు పెద్ద‌పీట వేశారు. ఇక‌, స‌మాజంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న గృహ హింస, పురుషాధిత్య‌త‌, మ‌హిళ‌ల‌పై దౌర్జన్యాలు వంటివాటిని అరిక‌ట్టేందుకు త‌న‌వంతు కృషి చేస్తున్నారు.. అత్యాచారాల‌కు గురైన ఆడపిల్లలను ఆదుకోవడంతోపాటు వారి జీవనస్థితిగతులు మెరుగుపడేలా సహాయపడుతున్నారు.. దీనిని మ‌రింత విస్తృతం చేయ‌నున్నారు.. ఈ క్ర‌మంలో `నారీ ఫౌండేషన్` సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు సహాయపడుతున్నారు. ఓవైపు ఐటీ కన్సల్టింగ్‌ కంపెనీ ప్రెసిడెంట్‌గా ఎంతోమందికి ఉపాధి సౌకర్యాన్ని క‌ల్పించారు చాందిని దువ్వూరి.

ప్రముఖుల కార్యక్రమాల్లో..

అమెరికాకు వచ్చిన ప్రముఖుల పర్యటనల్లో చాందిని దువ్వూరి కీలకపాత్ర పోషించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూజెర్సి, కాలిఫోర్నియా పర్యటనల సమయంలో వారి పర్యటన ఏర్పాట్లను చూసే కమిటీలో, అలాగే చికాగోలో భార‌త‌ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు పర్యటన కమిటీలో, డల్లాస్‌, చికాగోలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్ల కమిటీలో చాందిని దువ్వూరి కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా భార‌తీయ సంగీతంపై ఉన్న ఆసక్తితో పలు సంగీత కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులతో అమెరికాలో కచేరీలు ఏర్పాటు చేయించారు. దేవిశ్రీ ప్రసాద్‌, ఎస్‌ఎస్‌. థమన్‌, ఎ.ఆర్‌. రెహ్మాన్‌, మణిశర్మ, ఆర్‌.పి. పట్నాయక్‌లాంటి దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల‌తో కచేరీలు ఏర్పాటు చేయించారు.

లక్ష్యం.. ఇదే!

చాందిని దువ్వూరి నేటి త‌రాన్ని.. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను అభ్యున్న‌తి బాట‌వైపు న‌డిపించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు ఎల్లవేళలా అండగా ఉండటం, వారి చదువుకు సహాయపడటం, గృహ హింస, ఇతర దౌర్జన్యాలకు బలైన మహిళలను, ఆడపిల్లలను ఆదుకోవడంతోపాటు వారి జీవనస్థితిగతులు మెరుగుపడేలా కృషి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో చాందిని దువ్వూరి వంటి దూర‌దృష్టి, నిశిత ప‌రిజ్ఞానం, స‌మాజంపై అవ‌గాహ‌న‌, మ‌హిళ‌ల‌ను అభ్యున్న‌తి ప‌థంలో న‌డిపించాల‌నే త‌ప‌న ఉన్న వారికి అవ‌కాశం ఇవ్వ‌డం. గెలిపించుకోవ‌డం మ‌న బాధ్య‌త‌. కాబ‌ట్టి.. ఆమెనే గెలిపించుకుందాం.. మ‌న కుటుంబాల‌ను అభ్యున్న‌తి దిశ‌గా న‌డిపించుకుందాం.

Tags: chandini duvvuri
Previous Post

హెల్త్ మాఫియా… కేసీఆర్ కంటే బలమైనదా?

Next Post

మోడీ ని  ఉతికి ఆరేసిన ‘ద గార్డియ‌న్’ 

Related Posts

NRI

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

February 12, 2023
TANA Elections

‘తానా’ లో మూడు ముక్కలాట-3

February 10, 2023
Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
Load More
Next Post

మోడీ ని  ఉతికి ఆరేసిన 'ద గార్డియ‌న్' 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra