ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు ఆయన అభిమానులకు,, ప్రజలకు.. కూడా పండగ కానుంది. ఏకంగా.. తిన్నంత తిండి.. చేతికి కావాల్సినంత ఎనిమిదిన్నర లక్షల సొమ్ము కూడా.. బహుమానంగా అందనుంది. మోడీ బర్త్‌డేను పురస్కరించుకుని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ సూపర్ డూపర్ ఆఫర్ ప్రకటిం చింది. మోడీ బర్త్ డే అయిన సెప్టెంబరు 17న (శనివారం) తమ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేకమైన థాలీ (భోజనం) సిద్ధం చేసింది. కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న రెస్టారెంట్ పేరు ‘అర్డోర్ 2.0’(ARDOR 2.0).
ఈ రెస్టారెంట్ ఆఫర్ చేస్తున్న థాలీలో 56 రకాలు ఉంటాయి. వినియోగదారులకు ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే వెజ్, నాన్‌వెజ్ రకాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. రెస్టారెంట్ యజమాని పేరు సుమిత్ కలారా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని ‘56 అంగాళాల మోడీ జీ’ పేరుతో గ్రాండ్ థాలీని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఈ థాలీని ప్రధాని మోడీకి బహుమతిగా ఇవ్వాలని రెస్టారెంట్ భావించింది.
అలాగే, తమ రెస్టారెంట్‌కు మోడీ స్వయంగా రావాలని కోరుకుంది. అయితే, భద్రతా పరమైన కారణాలు అందుకు అంగీకరించలేదు. అందుకనే ఈ థాలీని ఆస్వాదించేందుకు అభిమానులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్టు సుమిత్ చెప్పారు. ఈ గ్రాండ్ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేసిన వారికి రూ. 8.5 లక్షల బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సుమిత్ తెలిపారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఒక్కరైనా, జంటలుగా అయినా రావొచ్చని వివరించారు.
లక్కీ డ్రాలో గెలిచిన అదృష్టవంతుడికి ప్రధానికి అత్యంత ఇష్టమైన కేదార్‌నాథ్‌కు ఉచిత ట్రిప్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, మోడీ బర్త్‌డేను 16 రోజులపాటు సేవా పఖ్వారా పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. శనివారం (17న)న ప్రారంభం కానున్న ‘సేవా పఖ్వారా’ మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది.