రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం
అరాచక పాలనను అంతమెందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఎన్నికలు కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్ అని చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు టీడీపీ ఎన్.ఆర్.ఐ విభాగం తరపున తమ వంతు కృషి చేస్తామని టీడీపీ ఎన్.ఆర్.ఐ విభాగం నేతలు అన్నారు.
మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో ‘విజన్ ఫర్ విక్టరీ’ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఎన్.ఆర్.ఐ టీడీపీ అమెరికా అధ్యక్షులు ‘కోమటి జయరాం’ మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యం.
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం మా వంతుగా సహకారం అందిస్తాం.
ఇప్పటికే అన్ని దేశాల నుంచి 2 వేల మంది ఎన్.ఆర్.ఐలు రాష్ట్రానికి వచ్చారు.
త్వరలో మరో 2 వేల మంది అమెరికా నుంచి వస్తారు. వీళ్లంతా ప్రతి నియోజవర్గంలో సోషల్ మీడియా, ప్రచారం,కూటమి అభ్యర్దులకు ఆర్దిక సహకారం అందిస్తారు.
మేమంతా నేడు వివిద దేశాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే.
వైసీపీ ప్రభుత్వ వైఖరితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, మళ్లీ రాష్ట్రాన్ని గాడిలోపెట్టాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
టీడీపీ ఎన్.ఆర్.ఐ నేత వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలో అరాచక పాలనను అంతమెందించాలి.
మా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. 5 ఏళ్లలో రాయలసీమకు జగన్ చేసింది శూన్యం.
సీమ అభివృద్ది కావాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి.
అందుకే ప్రతి రోజు ఒక నియోజకవర్గాన్ని వెళ్లి స్ధానిక పరిస్దితులు, ప్రజల కష్టాలు కూటమి అభ్యర్దుల దృష్టికి తీసుకెళ్లి..పార్టీ అధికారంలోకి వస్తే మేం ఏం చేస్తామో కూడా చెబుతున్నాం.
పార్టీ కోసం పాటుపడే వేలాది మంది ఎన్ .ఆర్ ఐలకు ఈ కార్యక్రమం వారధిలా ఉపయోగపడుతుంది.
జగన్ మోసాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.
సతీష్ వేమన మాట్లాడుతూ అమెరికాలో 6 మిలియన్ల ప్రజలు ఉంటే అందులో 2 మిలియన్ల ప్రజలు తెలుగువారు ఉన్నారు.
దీనికి కారణం చంద్రబాబే.
జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తాం.
ఈ నెల రోజులు రాత్రింభవళ్లు కష్టపడి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాం.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో 119 దేశాల్లో నిరసనలు తెలిపామన్నారు.
చందు గురుపాటి మాట్లాడుతూ…..చంద్రబాబు విజన్ కి ప్రతి రూపాలం మేము.
ఆయన వల్ల మేం ప్రతిఫలం పొందాం.
కాబట్టి ఈ నెల రోజులు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాం.
చట్టసభల్లో ఎన్.ఆర్ ఐలకు చంద్రబాబు అవకాశం కల్పించారు.
అలాంటి నాయకుడికి మేం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.