గత ఐదేళ్ల బాబు పాలనలో రాయలసీమకు తనకు చేతనైనంత అభివృద్ధి చేశారు.. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అని విద్యార్థులకు భరోసా కల్పించే పరిశ్రమలు తెచ్చారు. అనంతపురంలో కియా తిరుపతిలో సెల్కాన్ చిత్తూరు నెల్లూరు బార్డర్ సత్యవేడు శ్రీసిటీలో హీరో అపోలో సహా మధ్య చిన్న తరహా పరిశ్రమలు.
గత బాబు హయాంలో కేంద్ర సంస్థలు రాష్ట్రానికి పది వస్తే అందులో నాలుగు రాయలసీమకు. IIT తిరుపతి చిత్తూరు జిల్లా IISER తిరుపతి చిత్తూరు జిల్లా Central University అనంతపురం జిల్లా IIIT కర్నూలు జిల్లా.
భవిష్యత్తులో విద్యుత్ సమస్య రాకుండా కర్నూల్ లో సోలార్ పార్క్ నిర్మాణం పూర్తి. కర్నూలులో విమానాశ్రయం వైపు అడుగులు.
ఆధ్యాత్మికంగా భద్రాచలం పోయిన లోటు కడప ఒంటిమిట్ట ద్వారా భర్తీ చేశారు.పర్యాటక రంగం లో గోల్కొండ పోయిన లోటు కడప గండికోట అభివృద్ధి ద్వారా భర్తీ.
కరువుసీమ గా పేరుపడ్డ రాయలసీమలో అనంతపురం చిత్తూరు జిల్లాలకు పట్టిసీమ ద్వారా నీటి విడుదల పెండింగ్లో ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టు పూర్తి. బ్రహ్మంసాగర్ అంశంలో 1995-2004 నిర్లక్ష్యం చేసినా 2014-19 మధ్యలో రెండుసార్లు 6 టిఎంసీల ఒకసారి 4 టీఎంసీలు నీరు నిల్వ. తద్వారా వ్యవ’సాయం’.
వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు జిల్లా రహదారుల నిర్మాణం కేంద్ర సహకారం తో గ్రామీణ రహదారులు. ఎల్ఈడీ వెలుగులు. మొత్తంగా గత ఐదేళ్ల పాలనలో బాబు సీమకు అంత అన్యాయం చేయలేదు .. జనం బాబు కి న్యాయం చేయలేదు.
2014 లో టిడిపి గెలిచినా రాయలసీమ లో మాత్రం 30/52 జగన్ హవా అని చెప్పాలి. ఇక 2019 లో 49/52 తో దాదాపు Clean sweep. రాయలసీమ లో జగన్ పై నమ్మకానికి ఇవి లెక్కల సాక్షాలు. మరి జగన్ జనం నమ్మకాన్ని ఏమేరకు నిలబెట్టుకున్నారు? గత మూడేళ్లలో పూర్తి అయిన జల ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. కడప జిల్లా లో ఉక్కు పరిశ్రమ మూడేళ్ల క్రితం శంఖుస్థాపన. బద్వేలులో ఒక పరిశ్రమ ఇటీవల శంఖుస్థాపన. పోతిరెడ్డిపాడు వద్ద కొత్త ప్రాజెక్టు అన్నారు. ఇంతవరకు స్థితి గతి లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం బాధాకరం. ఇటీవల జాతీయ రహదారి నిర్మాణం పై ఆశలు. ఇది ఇప్పట్లో పూర్తి అవదు. న్యాయ రాజధాని ద్వారా జనాన్ని మభ్యపెట్టడం చూశాం. హైకోర్టు కర్నూలు కి రావడం వలన పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. కేంద్ర సంస్థ ఒకటి కూడా వచ్చిన దాఖలాలు లేవు. రానున్న రెండేళ్లలో జల ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉందా అంటే గత మూడేళ్లుగా జరుగుతున్న పనులు చూస్తే కష్టమే.
బాబుకి జనం రావడం తక్కువే. అప్పుడెప్పుడో 2008 లో అనుకుంటా యువగర్జనకు జనం పోటెత్తారు. ఇపుడు మళ్లీ జనం నీరాజనం. జగన్ కి పూర్తి అనుకూలమైన రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. రాయలసీమ లో రెడ్డి ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతం. వచ్చిన జనం ఇవన్నీ గ్రహిస్తారా? అభివృద్ధి కన్నా కులం ఎక్కువ చూస్తారా? వచ్చిన జనాన్ని ఓట్లు గా మరలిస్తారా? అనేది చూడాలి.