హైదరాబాద్ కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్ల ధర పలకడానికి—చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అమెరికాలో ప్రదర్శనలకి…ఏదైనా లింక్ ఉందా?
హైదరాబాదులో కొత్తగా కడుతున్న ఏ వెంచర్లో చూసినా…రెండు కోట్ల రూపాయలకు తక్కువలో ఫ్లాటు దొరకకపోవడానికి….చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆస్ట్రేలియాలో ర్యాలీకి ఏదైనా లింకుందా?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బయో టెక్నాలజీ,మెడికల్ సైన్సెస్,ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్పోరేట్ విద్యాసంస్థలకు….హైదరాబాద్ గమ్యస్థానంగా మారటానికి….చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కెనడాలో జరిగిన సభలకు ఏదైనా సంబంధం ఉందా?
గత పాతిక సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయం చేసుకునే చాలామంది తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికెళ్ళి, కొన్ని నెలల పాటు ఉండి రావడానికి….చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సింగపూర్లో జరుగుతున్న కార్యక్రమాలకు ఏదైనా సంబంధం ఉందా?
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే చూసిన ఖరీదైన కార్లు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపించటానికి…..చంద్రబాబు అరెస్టుకు నిరసనగా స్విట్జర్లాండ్ లో జరుగుతున్న కార్యక్రమాలకు ఏదైనా లింకుందా?
సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ విప్రో సర్కిల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ధర్నా చేయడం వల్ల… వేలాది మంది ఉద్యోగులు రెండు గంటలు ఆలస్యంగా లాగిన్ అవడం వల్ల…సుమారు 100 దేశాలలో బహుళ జాతి కంపెనీల రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం కలిగి…కారణం తెలుసుకున్న తర్వాత…ఆయా కంపెనీల ప్రతినిధులు చంద్రబాబు గురించి తెలుసుకోవటానికి….. హైదరాబాద్ పోలీసులు నిరసనల మీద ఉక్కు పాదం మోపటానికి ఏదైనా లింకుందా?
హైదరాబాదు లో,అమరావతి లోనే కాదు-తెలుగు రాష్ట్రాలలో,దాదాపు అన్ని జిల్లాలలో భూముల ధరలు ఆకాశాన్ని తాకటానికి…..చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బెంగళూరు నగరం గొంతు ఎత్తటానికి ఏదైనా లింకుందా?
పోలింగ్ రోజు ఓటెయ్యటానికి కూడా బయటికి రారని విమర్శలు ఎదుర్కొనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు…పోలీసు నిర్బంధాన్ని కూడా అధిగమించి హైదరాబాదు నుంచి రాజమండ్రి కి సంఘీభావ యాత్ర చేయడానికి ఏదైనా లింక్ ఉందా?
ఇలా చెప్పుకుంటూ పోతే….గత పాతికేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోట్లాదిమంది జీవితాలను మార్చిన సాంకేతిక విద్యా విప్లవం గురించి చెప్పుకోవాలి.
ఆ సాంకేతిక విప్లవంలో పాత్రధారులైన లక్షలాదిమంది రైతు కూలీ బిడ్డల గురించి చెప్పుకోవాలి.
నూజివీడు రైతుబిడ్డ న్యూ జెర్సీలో కొనుక్కున్న విల్లా గృహప్రవేశం గురించి చెప్పుకోవాలి.
ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే…..మన కళ్ళముందే ఆవిష్కృతమైన ఒక నాలెడ్జ్ ఎకానమీ గురించి చెప్పుకోవాలి.
కొడవలితో పనిచేసే చేతులు కంప్యూటర్లతో పనిచేయటం వల్ల ప్రపంచ మాగాణంలో పచ్చని పంట లా ఎదిగిన తెలుగింటి పిల్లల్ని చూడాలి.
పూర్ కుటుంబాలలో పుట్టినప్పటికీ…చదువే ఆధారంగా ప్రపంచ స్థాయి నగరాల్లో రిచ్ గా బతుకుతున్న రైతుకూలీ బిడ్డలను చూడాలి.
అలా చూస్తే అర్థమయిద్ధి………పూర్ టు రిచ్….అనేఒక విజనరీ ఆలోచన……అది అనుభవించిన వాళ్లకు/అర్థం చేసుకున్న వాళ్లకు తెలుస్తుంది ఆ మనిషి తపన.
స్టాలిన్ సినిమాలో…సహాయం పొందిన ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి సహాయం చేయమని హీరో చెబుతూ ఉంటాడు.
ఎంతోమంది తన మాటను ఆచరిస్తున్నారని చావు బతుకుల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు తెలుసుకుంటాడు.
అలాగే…..
కొద్ది నెలలుగా తాను చెబుతున్న పూర్ టు రిచ్……….అ నే అభివృద్ధి మంత్రం … పాతిక సంవత్సరాలుగా….తెలుగు నేల సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని…….రాజమండ్రి చెరసాలలో ఉన్న రాజర్షి….
మరికొద్ది రోజుల్లో తెలుసుకుంటాడు.