బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటే ప్రపంచంలో జరిగే అనేక రకాల సంఘటనలు అన్నీ ఏదో ఒక రకంగా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి అని, ఒక చోట జరిగే ఒక ‘చిన్న సంఘటన’ ..వేరే చోట జరగబోయే వేరే ‘పెద్ద సంఘటన’ కి కారణం అయి ఉంటుంది అని. ఒక సీతాకోకచిలుక తన రెక్కలని విప్పార్చి గాలిలో ఎగిరితే కలిగే మొమెంటం..వేరే చోట వచ్చే ‘టైఫూన్’ లాంటి గాలి దుమారం కి కారణం అవుతుందని చెప్పడానికి ఈ బటర్ ఫ్లై ఎఫెక్ట్ పేరు ని వాడతారు.
2002 గుజరాత్లోని గోద్రా లో జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలో దాదాపు 2000 మంది చనిపోయినపుడు కేంద్రంలో అధికారంలో వున్న NDA కన్వీనర్ గా వున్న చంద్రబాబు వాజ్ పేయీ ని కలిసి మోడీ ని గుజరాత్ లో అధికారం నుంచి తప్పించమని కోరారు. వాజ్ పేయీ బాబు ని సపోర్ట్ చేసినా అద్వానీ మోడీ వైపు నిలబడ్డాడు. అతను ఆంధ్రప్రదేశ్ వస్తే అరెస్ట్ చేస్తామని అన్నారు. మోదీ ప్రభ గుజరాత్ వరకే పరిమితం ఆనాటికి….అదొక ‘చిన్న స్టేట్మెంట్’. 2014 లో అవసరానికి బాబుని పిలిచి, చేయి పట్టుకుని లాగి మరీ, వేలాది జనం ముందు స్టేజి మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నా.. అదే మోడీ ఈరోజు జైలు లో కూర్చోబెట్టాడు. వ్యవస్థలని రిమోట్ కంట్రోల్ తో మేనేజ్ చేస్తూ, అంటే అరేబియా సముద్రం తీరాన జరిగిన ఒక చిన్న సంఘటన ఈరోజు బంగాళాఖాతం తీరంలో జరిగిన ఒక పెద్ద సంఘటన కి కారణం అయ్యింది.
ఈ వ్యవస్తలని మేనేజ్ చెయ్యడం అనేది అతనికి కొత్తేమి కాదు. 2019,ఏప్రిల్ లో అప్పటి CJI రంజన్ గోగోయ్ మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు ఒక ’ కోర్టు ఆఫీసర్’ చేత చేయించి, నవంబర్ లో వచ్చే అయోధ్య జడ్జిమెంట్ ని ప్రభావితం చేసారు. ఆ సమయంలో ఒక రిటైర్డ్ జడ్జి తో ఒక కమిటీ వేసి, సీబీఐ, ఐబి, ఢిల్లీ పోలీస్ కమీషనర్ లని అసిస్టెన్స్ ఇచ్చి మరీ ఆయన్ని ఒత్తిడిలో పెట్టి, ఆయనని ప్రభావితం చేశారు. చెప్పింది చేసినందుకు ప్రతిగా తర్వాత రాజ్యసభ మెంబెర్ గా నామినేట్ చేసారు.
అలాగే తమ మిత్రుడి మీద ఉన్నా సీబీఐ, ED కేసులని కెలకకుండా ఉండేందుకు, అయన మీద CJI అయ్యేప్పుడే, ఆంధ్ర ప్రభుత్వం చేత ఆరోపణలు చేయించి ఒత్తిడి లో పెట్టారు. ఫలితంగా ఆ కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అమిత్ షా ప్రమేయం ఉందన్న ఆరోపణలున్న సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ ని విచారిస్తున్న సీబీఐ కోర్ట్ జడ్జి B. M. లోయ అనుమానాస్పద మరణం మాట వినని వారికి ఒక హెచ్చరిక.
‘పెద్ద తలకాయ ని భయపెట్టేస్తే ..వెనకాల ఉన్న చిన్న తలకాయలు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి భయం తో’ …ఇదే కేటర్ పిల్లర్ ఎఫెక్ట్. హైవే మీద ముందు ఒక పెద్ద వెహికల్ ఆగితే ..వెనకాల అన్ని వెహికల్స్ అలానే, అదే వరుసలో నెమ్మదించి, మెల్లగా కదులుతూ ఉంటాయి…అవే అడుగు జాడల్లొ CJI భయపెడితే ….ఇంకా మిగిలిన న్యాయ వ్యవస్థ రాజకీయం నిర్ణయించే ట్యూన్స్ కి అనుగుణంగా నృత్యం చెయ్యక తప్పుతుందా ?
చంద్రబాబు విషయంలో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. అయన అరెస్ట్ తర్వాత సబ్ ఆర్డినేట్ కోర్టు నుండి సుప్రీమ్ కోర్ట్ వరకు వేస్తున్న పిటిషన్స్ , బెయిల్స్, పిటిషన్స్, జరుగుతున్న వాదనలు, తీర్పు రిజర్వు లు, నాట్ బిఫోర్ మి లు, రిమాండ్ ఎక్స్టెన్షన్ లు, కస్టడీ పిటిషన్ లు చూస్తే ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా విషయం అర్ధం అవుతుంది.
1. 2018/21 లో పెట్టిన FIR లో పేరు లేని చంద్రబాబుని అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడానికి ఎందుకు ప్రయత్నించారు ?
2. తర్వాత రోజు మొత్తం విచారణ చేసి, బాబుకి, ఆయన లాయర్స్ కి ఆరోపణలున్న మెటీరియల్ వెంటనే ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే హైకోర్టులో పిటిషన్ వేస్తారనే గా?
3. మనీ ట్రయల్ లేని రిమాండ్ రిపోర్ట్ ని చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు విషయంలో కోర్టు ఎలా యాక్సెప్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ మెకానికల్ గా ఎలా ఇచ్చింది? కోర్టు రిమాండ్ ఇస్తుంది అన్న విషయం జగన్ మీడియా కి ఎలా ముందే తెలిసింది ?
4. అపెక్స్ కోర్ట్ లో రోస్టర్ ప్రకారం సింగిల్ జడ్జి కోర్ట్ లో ఒకే సామాజిక వర్గం వారు ఎలా ఉన్నారు? 17 A అప్లై అవుతుందా లేదా అని చెప్పడానికి రెండు వారాలు ఎందుకు పట్టింది ?
5. ఢిల్లీ అపెక్స్ కోర్ట్ లో వాదనలు వినాల్సిన జడ్జి బెంచ్ మీదకు వచ్చి మరీ నాట్ బెఫోర్ మీ అని ‘అయన సమయంలో నియామకం అయ్యాను’ అన్న ఏకైక కారణం తో ఎందుకు చెప్పారు ?
6. గుజరాత్ నుండే వచ్చిన జడ్జి వున్న బెంచ్ కే అ కేసు ఎందుకు వెళ్ళింది? వారు ముందు రోజు తిరుపతి దర్శనానికి ఎందుకు వెళ్లారు ?
7. 17A అప్లికెబిలిటీ మీద వున్న పాత తీర్పులను దృష్టి లో పెట్టుకోకుండా దాదాపు మినీ ట్రయల్ ఎందుకు నిర్వహించారు? ఒక్క ఆధారం చూపకుండానే చెప్పినవే చెబుతున్న లాయర్ వాదనలని ఎందుకు అంత సేపు వినాల్సి వచ్చింది ?
8. వాదనలు అయ్యాక, తీర్పు రిజర్వ్ చేసాక ఇంటరిమ్ బెయిల్ అడిగితే త్వరగా తీర్పు ఇస్తాం కదా అని మభ్య పెట్టి, 6 రోజులు దసరా సెలవులు అయ్యాక కూడా, మరో పది రోజుల వరకూ తీర్పు రిజర్వు లోనే వుంచడం లో వున్న మతలబ్ ఏంటి ?
9. సబార్డినేట్ కోర్ట్ లో AAG చెప్పిందే వేదం లా నడవడం, ఆయన డిఫెన్సు వారితో డైరెక్ట్ గా వాదనలు చేస్తూ, విసురుగా కోర్టు నుంచి వెళ్ళిపోతే, న్యాయాధికారి అతన్ని ఒక్క మాటతో కూడా మందగించకుండా కోర్ట్ ని వాయిదా వెయ్యడం ఏంటి ?
10. కాల్ డేటా కావాలన్న పిటిషన్ మీద ఎన్నో వాయిదాలు వెయ్యడం ఎందుకు? చివరకు తిరస్కరించటం ఏంటి?
11. రిమాండ్ ఆర్డర్ సర్టిఫైడ్ కాపీని న్యాయాధికారి ని ఛాంబర్ లో అడిగి, ఛాంబర్ బయట నిలబడితే, లోపలి కి వెళ్లి బయటకి వచ్చిన విజయవాడ C.P ‘ఆ కాపీ అడిగింది ఎవరు‘? అని బెదిరించినట్లు డిఫెన్సు లాయర్స్ ని అడగడం లో ఉద్దేశ్యం ఏంటి ? అసలు అ విషయం CP కి ఎలా తెలిసింది? న్యాయాధికారి, డిఫెన్సు మధ్య’ ఛాంబర్ ‘లో జరిగిన విషయం CP కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?
12. అపెక్స్ కోర్టు లో వెకేషన్ బెంచ్ కి రిఫెర్ అయిన బెయిల్, ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ లని 23-30 తారీఖుల మధ్య విచారించాల్సి వుంటే …27 దాకా వెకేషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు? 27న వచ్చాక ‘నాట్ బిఫోర్ మీ’ అని ఒక సిల్లీ రీజన్ తో అనడం ఏంటి? మెడికల్ రీజన్స్ మీద అడిగిన బెయిల్ కి డిఫెన్స్ లాయర్ భార్య తనకి కొలీగ్ అని చెప్పి తప్పుకోవడం, అసలైన రీసన్ చెప్పే ధైర్యం మనస్సాక్షి కి లేదని, ఎదుర్కొంటున్న ఒత్తిడి ని చెప్పకనే చెప్పడం కాక ఏమిటి ?
13. ఆ పిటిషన్స్ 30 తారీఖున బెంచ్ మీదకి వస్తుంటే 28 తారీఖున రోస్టర్ మారడం ఏంటి? కొత్త జడ్జి కి అవి కేటాయిన్చబడడం ఏంటి ?
14. బెంచ్ హంటింగ్, ఫోరం షాపింగ్ ల ద్వారా నచ్చిన బెంచ్ దగ్గరకు తమ కేసు వెళ్లేట్లు చేసి ఫేవరబుల్ ఆర్డర్స్ తెచ్చుకునే పని లాయర్స్ చేస్తారు. ఇక్కడ జడ్జి లు తమకు నచ్చిన కేసు మాత్రమే వింటాం, నచ్చనిది మా ముందుకు వద్దు అని చెప్పడం అంటే కక్షిదారులకు న్యాయం పొందడానికి వున్న న్యాయపరమైన హక్కు ని నిరాకరించడమే కదా?
15. సరైన న్యాయం అందించినట్లు కనబడటం కోసం వున్న ఒక అన్ రిటన్ రూల్ ని అడ్డం పెట్టుకుని “న్యాయాన్ని నిరాకరించడం” అనేది చంద్రబాబు కేసులో స్పష్టంగా కనబడుతోంది.
రాజ్యాంగంలోని లెజిస్లేటివ్, ఎక్జిక్యూటివ్, జుడిసియల్ వ్యవస్థల తెంపరితనం, దుర్మార్గులైన వ్యక్తుల చేతిలో పడితే రాజ్యాంగం ఎలా ఉంటుందో ఆనాడే అంబేద్కర్ ఊహించి చెప్పింది ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే!
2014 నుండి జగన్ మీద వున్న 33 కేసులు సుషుప్తావస్థ లో ఉండడం, అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు CJ Atrocious అన్నా, మూడో కంటికి తెలియకుండా అయిదు లక్షల పూచీ కత్తి తో ఇవ్వడం, కవిత ని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చెయ్యకపోవడం, ఢిల్లీ డిప్యూటీ CM మనీష్ సిసోడియా కి మనీ ట్రయల్ ఆధారాలు లేకపోయినా ఫిబ్రవరి నుండి బెయిల్ రాకపోవడం కేవలం ప్రతిపక్ష నాయకుల మీదే సీబీఐ , EDలు కేసులు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగంలోని లెజిస్లేటివ్, ఎక్జిక్యూటివ్, జుడిసియల్ వ్యవస్తలని దుర్యోధన, దుశ్యాశనుల్లా మోషా ద్వయం చెరబట్టిన విషయం ప్రజాస్వామ్య వాదులందరినీ కలచివేస్తోంది.
ఒక దార్సనికుడిని, మోడరన్ ఆంధ్ర ప్రదేశ్ సృష్టి కర్తని అరెస్ట్ చేసినంత ఈజీ గా సాక్ష్యాలు చూపలేక, మింగలేక కక్కలేక న్యాయ వ్యవస్థ పెడుతున్న ఎక్కిళ్ళు చూస్తుంటే దేశంలో న్యాయదేవత అంపశయ్య మీద ఉందేమో అనిపిస్తున్నది.
ఈ గుజ్జు గాళ్ళ పాలన లో. బి జే పి వాళ్ళు చెబుతున్న తమ రామరాజ్యంలో, జనాలు అనుకుంటున్న ‘నడుస్తున్న రావణ రాజ్యం’లో, న్యాయదేవత వస్త్రాపహరణ ఘట్టంలో ఏ కృష్ణుడు వచ్చి వలువలు విడుస్తున్న విలువలని కాపాడతాడో వేచి చూద్దాం.
#ధర్మోరక్షితరక్షితహా