రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ కీలక చార్జిషీట్ దాఖలు చేయటం తెలిసిందే. అందులోని అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కమ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన దానిపై సీబీఐ తనకున్న అనుమానాన్ని వెల్లడించింది. వైఎస్ వివేకాను కడప ఎంపీ అవినాశ్ రెడ్డినే హత్య చేసి ఉంటారని పేర్కొంది. ఎందుకిలా అన్న ప్రశ్నకు సీబీఐ తన చార్జిషీట్ లో సమాధానం చెప్పేసింది.
కడప లోక్ సభ నియోజకవర్గం వైసీపీ టికెట్టు అవినాష్ రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిలకు.. విజయమ్మలలో ఎవరికైనా ఒకరికి రావాలన్నది వైఎస్ వివేకానంద రెడ్డి ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అవినాశ్ రెడ్డి…వివేకాను హత్య చేసి ఉంటారనే అనుమానం ఉందని పేర్కొంది. తమ దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని.. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ హత్య కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొన్న వారు..
– ఎర్ర గంగిరరెడ్డి
– శివశంకర్ రెడ్డి
– యాదటి సునీల్ యాదవ్
– గజ్జల ఉమాశంకర్ రెడ్డి
– షేక్ దస్తగిరి
– శివశంకర్ రెడ్డి
– యాదటి సునీల్ యాదవ్
– గజ్జల ఉమాశంకర్ రెడ్డి
– షేక్ దస్తగిరి
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ గతంలో దాఖలు చేసిన అభియోగ పత్రాలు సోమవారం బయటకు వచ్చాయి. ఇప్పటివరకు తమ దర్యాప్తులో వెలుగు చూసిన.. గుర్తించిన అంశాల్ని సీబీఐ ప్రస్తావించింది. అందులో పలు సంచలన అంశాల్ని పేర్కొంది.
– వివేకానంద రెడ్డిని హత్య చేసిన నేరాన్ని మీద వేసుకొన్న పక్షంలో రూ.10 కోట్లు ఇస్తామని గంగాధరరెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆఫర్ చేశారు.
– నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం ఢిల్లీకి పిలిపించిన విషయం శివశంకర్ రెడ్డికి తెలిసి.. సీబీఐకు తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితాన్ని సెటిల్ చేస్తామని అతడికి హామీ ఇచ్చారు.
– నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం ఢిల్లీకి పిలిపించిన విషయం శివశంకర్ రెడ్డికి తెలిసి.. సీబీఐకు తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితాన్ని సెటిల్ చేస్తామని అతడికి హామీ ఇచ్చారు.
– ఢిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు సీబీఐ ఆయన్ను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకోవటానికి భరత్ యాదవ్ ను అక్కడకు పంపారు.
– వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు ఇస్తారు అంటూ ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పాడు. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోద్దని.. వైఎస్ అవినాష్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. మనోహర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలు లాంటి పెద్దలు ఈ హత్యలో ఉన్నట్లుగా దస్తగిరికి ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.

– వివేకా మరణించిన విషయాన్ని తెలుసుకున్నంతనే 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో పాటు ఇతర సన్నిహితులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివేకా డెడ్ బాడీ రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాశ్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలు ప్రచారం షురూ చేశారు. ఇదే మాటను శివశంకర్ రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె.. అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియులు నిర్వహించేందుకు ప్రయత్నించారు.