ఏపీ సీఎం జగన్‌కు కంటిపై కునుకు లేకుండా పోతోందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ము ఖ్యంగా కీలక సమయంలో తనను ఆదుకుంటుందని భావించిన కేంద్ర దర్యాప్తు సంస్థ…. సీబీఐ.. హ్యాండి వ్వడం, కేంద్రం నుంచి తన పాలనకు ఎలాంటి సహకారం లేకుండా పోవడం.. వంటివి ఇప్పుడు జగన్‌కు తీవ్రంగా కలవరపెడుతున్నాయని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు అంటే.. తాను అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఏ నాడూ.. నేరుగా.. కేంద్రంపై యుద్ధానికి దిగిన చరిత్ర జగన్ హిస్టరీలో లేదు. దీనికి కారణం..తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్రం నుంచి సహకారం ఆయన ఆశించడమే.
ముఖ్యం గా తనకు ముప్పు పొంచి ఉందని భావించిన ప్రతిసారీ.. కేంద్రం, సీబీఐ తనను రక్షిస్తాయని ఆయన నమ్మ కం పెట్టుకోవడమే! అయితే..కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కానీ, ప్రధాని కనుసన్నల్లో మెలిగే సీబీఐ కానీ.. జగన్ విషయంలోను, ఆయన ప్రభుత్వం విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. జగన్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు.. సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. సీబీఐ కోర్టును ఆశ్రయిం చారు. ఈ క్రమంలో `ఏం చేయమంటారో చెప్పండి!` అంటూ.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. సీబీఐని కోరారు.
ఈ మధ్యలో సీఎం జగన్.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆయనను వెనుకేసుకు వచ్చారు. ఈ పరిణామం.. సీబీఐ కౌంటర్‌పై ఉంటుందని.. తనకు అనుకూలంగా కోర్టుకు సీబీఐ వాదన వినిపిస్తుందని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా సీబీఐ మాత్రం.. “మీ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు“ అని ఏక వాక్య తీర్మానంతో కౌంటర్ దాఖలు చేసింది.
ఈ పరిణామం.. జగన్‌కు పీకపై కత్తిపెట్టినట్టుగా మారిందని.. వైసీపీ నాయకులే గుసగుస లాడుతున్నారు. మరో వారం రోజుల్లో సీబీఐ కోర్టు బెయిల్ రద్దు పిటిషను పై నిర్ణయం వెలువరించనుంది.
ఈ నేపథ్యంలో సీబీఐ వ్యవహరించిన తీరుపై.. జగన్ కుతకుత లాడిపోతున్నారట. దీంతో ఇప్పుడు ఆయన కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. అంటున్నారు పరిశీలకులు.
ఇదే విషయాన్ని ఇంత నేరుగా చెప్పకపోయినా.. వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు సీబీఐ తీసుకున్న నిర్ణయంపై కొంత ఆలస్యంగా అయినా..తన ఆగ్రహాన్ని మరో రూపంలో వ్యక్తీకరిస్తున్నారు జగన్ అంటున్నారు నెటిజన్లు. కూడా మరి ఇది ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.