వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమకు చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఈ మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశాడో అనే ప్రశ్న పులివెందులను వెళ్లి అడగండి గూబ పగిలే సమాధానం చెబుతారు అని అశోక్ బాబు కౌంటరిచ్చారు.
అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ చేసి మరీ పులివెందులకు నీళ్లిచ్చిన సీఎం చంద్రబాబు అని అశోక్ బాబు గుర్తుచేశారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు తీసి చెక్ చేసుకోవాలని సూచించారు. పులివెందుల రైతును అడిగితే తమకు నీళ్లు ఎవరు ఇచ్చారో వాళ్లే చెబుతారని అపుడు శ్రీకాంత్ రెడ్డి ఆ సమాధానం విని సిగ్గుతో తలదించుకుంటారు అని అశోక్ రెడ్డి హెచ్చరించారు.
పచ్చి అబద్ధాలు, పనికిరాని నిందలు, బూతులు … నిరంతరం వైసీపీ నేతలు చేసే పని ఇదే అని విమర్శించిన అశోక్ బాబు.. అసలు కుల రాజకీయాలు అనే మాట వాడేముందు మీ ప్రభుత్వ సలహాదారుల్లో రెడ్లు ఎంత మందున్నారో లెక్కపెట్టుకోమని సూచించారు. వందల సంఖ్యలో పదవులకు రెడ్లకు అర్పించిన కులపాలన మీది. బీసీలకు పదవులు ఇచ్చిన జనపాలన మాది అని అశోక్ బాబు అన్నారు. అంతెందుకు తిరుమల శ్రీవారి ఆలయ పాలక కమిటికి మీరు నియమించింది రెడ్డిని, మేము నియమించింది బీసీని. అదొక్కటి చాలదా మీకు టీడీపీకి తేడా అని గుర్తుచేశారు అశోక్ బాబు.