దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని.. న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ 223(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రఘునందన్‌రావు ప్రెస్మీట్లో జుబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయ స్థానానికి అందచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ ఫొటో ల్లో ఉన్నది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని రఘునందన్ రావు ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు అబిడ్స్ పీఎస్‌లో రఘునందన్‌రావుపై కేసు నమోదు అయింది. మరోవైపు సాముహిక అత్యాచార బాధితురాలికి సంబంధించిన వివరాలను రిలీజ్ చేసిన ఓ జర్నలిస్టు సుభాన్పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు.
వీరిలో సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం ఓ మైనర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు సమాచారం.
కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్ఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత లేదు. పోలీసులు మాత్రం తాము ఇప్పటివరకు ముగ్గురునే అరెస్ట్ చేశామని చెబుతున్నారు.
మాటల తుటలా…..@RaghunandanraoM Anna???????? pic.twitter.com/QWCfWO36ve
— L PradeepRao(Modi Ka Parivar) (@LPradeepRao) June 7, 2022
When Raghunandan Rao can get the video proof of all the accused in this case, why can't the police department get the same with all the available resources n cc tv footage. Trying to hide something? Or is this video fake? https://t.co/KoMdinIKtV
— ఉక్కు మనిషి (@Iron_Man1009) June 4, 2022