హైదరాబాద్ లో జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీ లత సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు గురిపెట్టి బాణం వదులుతున్నట్టు ప్రచారమైన వీడియో వివాదం రేపిన విషయం తెలిసిందే. అయితే మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఆమె ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని, బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీలోని 295-ఏ (మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 ( ఉద్దేశపూర్వకంగా మతవిశ్వాసాలను రెచ్చగొట్టడం), హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
తన మీద వచ్చిన విమర్శలపై స్పందించిన మాధవీలత ‘’ఆ వీడియో అసంపూర్తిగా ఉన్నదని, దాని కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని’’ అన్నారు. ఎన్నికల సమయంలో అనవసర అంశాల మీద దృష్టిపెట్టడం మూలంగా అసలు అంశం పక్కకుపోతుందని, సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Unacceptable provocation… BJP candidate from Hyderabad Madhavi Latha seen here pretending to shoot an arrow at a mosque during the Ram Navami procession in Hyderabad ???????????????? pic.twitter.com/CK1UWpJ8b3
— Akshita Nandagopal (@Akshita_N) April 18, 2024