కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపైనే కాదు జీవనవిధానాలపై సైతం తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మాస్క్ అంటే డాక్లర్లు, వైద్య సిబ్బంది మాత్రమే ధరించేవారన్న భావన ఉండేది. ఇపుడు దాదాపుగా ప్రతి ఒక్కరి మాస్క్ ఓ కవచంలా మారింది. ఇక, భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితుల్లో వర్చువల్ సదస్సులు, జూమ్ మీటింగ్ లు సర్వ సాధారణం అయిపోయాయి.
అయితే, తాము కెమెరా ముందున్నామన్న సంగతి మరచిపోయిన కొందరు సెలబ్రిటీలు…నగ్నంగా జూమ్ మీటింగ్ లలో దొరికిపోయిన ఘటనలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా కెనడాకు చెందిన ఓ ఎంపీ జూమ్ మీటింగ్ సందర్భంగా నగ్నంగా కనిపించిన ఘటన వైరల్ అయింది. తోటి పార్లమెంట్ సభ్యులతో సమావేశంలో పాల్గొనాల్సిన ఎంపీ విలియమ్ ఆమోస్ అనుకోకుండా నగ్నంగా కెమెరా ముందు ప్రత్యక్షం కావడంతో ఇరకాటంలో పడ్డారు.
కెనడాలోని పాంటియాక్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విలియమ్ ఆమోస్ జాగింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకుంటున్నారు. అయితే, అనుకోకుండా ఆ సమయంలో హఠాత్తుగా జూమ్ వీడియో ఆన్ అయ్యిందని, దీంతో తాను నగ్నంగా సభ్యులకు కనిపించాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. లిబరల్ పార్టీకి చెందిన ఆమోస్…ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. ఇంకోసారి ఇలా జరగనివ్వనని హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులకు ఆయన క్షమాపణలు చెప్పారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది.