టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును అభ్యంతరకర పదజాలంతో ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దూషించడంపై ఏపీ, తెలంగాణలో క్షత్రియ వర్గం మండిపడుతోంది. హైదరాబాదులోని కొంపల్లిలో క్షత్రియులు వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఏపీలో సైతం క్షత్రియులు వెల్లంపల్లిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇరు తెలుగురాష్ట్రాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా వెల్లంపల్లికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని చూస్తున్నారు. మరోవైపు, ఏపీలోని గుడివాడలో పేకాట క్లబ్బుల దందా బయటపడడంతో పెను దుమారం రేగింది. మంత్రి కొడాలినాని కనుసన్నల్లో ఆయన బంధువులు ఈ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ఆ క్లబ్లుల రైడింగ్ లో దాదాపు రూ.10 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, రైడింగ్ లో కేవలం 42 లక్షలే పట్టుబడ్డాయని చెబుతున్నారు. ఈ తతంగం వెనుక సీఎంవో మంత్రాంగం నడిపిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు ఉద్వాసన చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నట్టటు జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ రెండు ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమ నిప్పులు చెరిగారు. బిజినెస్ మెన్, భరత్ అనే నేను సినిమాల తరహాలో జగన్ అనే నేను అని ప్రమాణం చేసిన జగన్ ….. దమ్ము, ధైర్యం ఉంటే పేకాట రాయుడ్ని బర్తరఫ్ చేయాలని ఉమ సవాల్ల విసిరారు. గుడివాడ సంక్రాంతి సంబరాలకు వచ్చిన జగన్ పేకాట శిబిరాలను ప్రోత్సహించారని, 19 నెలలుగా మంత్రి కొడాలి నాని, అతని అనుచరుడు దొండపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు మురళీ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరించిందని ఆరోపించారు. జగన్ ప్రోత్సాహంతోనే నాని బూతులు మాట్లాడుతున్నారని, నిన్న రాత్రి కోట్ల రూపాయలు దొరికితే కేవలం 42 లక్షలు దొరికాయని డిఎస్పీ, 55లక్షలు దొరికాయని ఎస్పీ చెప్తున్నారని మండిపడ్డారు. అక్కడ దొరికిన రూ.10కోట్లు తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్లాయా ? అని ఉమ ప్రశ్నించారు. సజ్జలకు కొడాలికి వాటాల్లో తేడా వచ్చే సరికి పేకాట శిబిరాలు బయటకు వచ్చాయని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టుబడిన మొత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలని, మంత్రి, అనుచరులపై కేసు నమోదుచేసి మంత్రిని బర్తరఫ్ చేసి, సిబిఐతో సమగ్రవిచారణ చేయించాలలని డిమాండ్ చేశారు. అశోక్ గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలుల చేసిన వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా వెల్లంపల్లి స్పందించడం లేదని మండిపడ్డారు.