వైఎస్ వివేకానందరెడ్డి ని ఎవరు చంపారు అన్న విషయంపై ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు ఎవరూ అడక్కపోయినా వైసీపీ దీనిపై ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాకేం పాపం తెలియదు అని చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
మొన్నటి వరకు మాకన్నును మేము పొడుచుకుంటామా? అని చెప్పిన వాళ్లే మా బాబాయ్ అమ్మాయిల పిచ్చోడని, సునీత మాపై కుట్రలు చేస్తోందని, చంద్రబాబు ఆమె వెనుక ఉన్నారని కథలు అల్లు తున్నారు. అవినాష్ రెడ్డి గెలుపుకోసం బాబాయి పనిచేశాడని సజ్జల అల్లిన కొత్త కథకు బీటెక్ రవి ఇచ్చిన సమాధానంతో సజ్జల మైండ్ బ్లాక్ అయిపోయింది.
వివేకా విషయంలో ఏం జరిగింది అన్నది ఇంత క్లియర్ గా అర్థమైన తర్వాత కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పడానికి ప్రయత్నించి వైసీపీ మరింత బుక్ అవుతోంది. వివేకా మర్డర్ తో వైఎస్ కుటుంబంలో లుకలుకలు అన్నీ బయటకు వచ్చేశాయి. వైఎస్ కుటుంబం అధికారం కోసం ఎన్నిరకాల ప్లాన్లు వేస్తుందో అందరికీ అర్థమైపోయింది.
ఇంతకీ బీటెక్ రవి సజ్జల గురించి ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి.
అబద్ధాలడి అడ్డంగా దొరికి పోవడం సజ్జల రెడ్డి గారికి అలవాటే. 2019 మార్చి 15వ తేదీ నాడు వివేకా హత్య జరిగితే, అవినాష్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది 2019 మార్చి 17వ తేదీన. మరి చనిపోయిన వివేకా గారి ఆత్మ వచ్చి అవినాష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిందా ? @SRKRSajjala pic.twitter.com/StgR9xxGUe
— B.Tech Ravi.Ex.MLC (@BTechRaviOff) March 2, 2022