తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంలో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఈ నెల 29తో 40 వసంతాలు పూర్తి కానున్నాయి. 1982, మార్చి 29న ప్రారంభించిన ఈ పార్టీ ఉమ్మడి రాష్ట్రం సహా నవ్యాంధ్రలోనూ అనేక సంచలనాలకు వేదికగా మారింది. అనేక మంది నాయకులను, ఉద్ధండులను రాజకీయాలకు అందించింది. రాష్ట్ర పరిపాలనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ పార్టీ 40వ వసంతాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతోపాటు యూరప్ లోనూ టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ నేత వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. యూరప్‌లోని ఎన్నారైలకు ఓ జ్ఞాపకంలా నిలిచిపోయేలా 40కిపైగా నగరాల్లో ఈ వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. యూరప్‌లోని టీడీపీ కౌన్సిల్ మెంబర్స్, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాలని వేణు మాధవ్ పిలుపునిచ్చారు.
తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని 29 మార్చి 1982లో స్థాపించిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అనడంలో సందేహం లేదు. తర్వాత.. పగ్గాలు చేపట్టిన, ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుసైతం పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లారు. జాతీయ రాజకీయా్లోనూ పార్టీకి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చారు. అనేక రూపాల్లో జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించి పార్టీ సత్తా చాటారు.
వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో టీడీపీ యూరప్ లో నాయకుడు వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు యూరప్‌లో 40కిపైగా నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టారు. యూరప్‌లోని టీడీపీ కౌన్సిల్ మెంబర్స్, నందమూరి అభిమానులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాలని వేణు మాధవ్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలోనూ భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 రోజుల పాటు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని.. ఇప్పటికే చంద్రబాబు పిలుపునివ్వడం గమనార్హం.