మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా’ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది. ప్రస్తుత ‘తానా ‘కార్యదర్శి అయిన ‘రవి పొట్లూరి’ స్వయంగా ఈ విషయాన్ని ‘నమస్తే ఆంధ్ర’తో చెప్పి,అమెరికా వ్యాప్తంగా అనేకమంది తో పరిచయాలు అనుచర గణం ఉందని కార్యదర్శినైన తనకే ఈ పోటీకు ప్రధాన అర్హత కూడా అని చెప్పారు.ఒకటి రెండు రోజుల్లో బహిరంగంగా కూడా ప్రకటిస్తూ, కార్యాచరణ తెలియచేస్తానని చెప్పారు.
నామినేషన్ల టైం కూడ రాకుండానే అనేక ఉద్రిక్త పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నిరంజన్ శృంగవరపు’ చెప్పుకుంటున్న లక్ష డాలర్స్ భూరి విరాళము వివరాలు కావాలనే డిమాండ్ ‘నరేన్ కొడాలి’వర్గం నుంచి మూడు పబ్లిక్ వీడియో మెసేజ్ ల ద్వారా రాగా ,ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ‘నిరంజన్ శృంగవరపు’ఇవ్వలేదు.నిజానికి ఆ విరాళము ఆయనది కాదని,ఆయనకు ఎటువంటి సంబంధం లేదని,ఒక ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ నుంచి వచ్చిందని రెండవ వర్గం వారు చెప్తున్నారు.అదే నిజమైతే ఈ విషయం మూలంగా కొన్నివిపత్కర పరిణామాలు ‘తానా ‘పరంగా గాని, ఆ కంపెనీ ఉద్యోగులకు గాని, మరేదైనా గాని సంభవించవచ్చు.అటువంటిదేదీ లేదని ఆశిస్తూ ,ఈ విషయం సమాచారం కొత్తగా మారితే తెలియచేస్తాం.అటు ‘నరేన్ కొడాలి’వర్గం ముఖ్య నాయకులు దేశవ్యాప్తం గా మద్దతుకై చేసిన ప్రయత్నాలు కలగా పులగంగా ఉన్నందున, ఎందుకైనా మంచిదని ‘నిరంజన్ శృంగవరపు’వర్గంతో పోటీ నివారణ ఫార్ములాల పై పయత్నాలు చేసినట్లు,ఆ పరిణామాల పై ఇప్పటికే అసంతృప్తి గా ఉన్న’రవి పొట్లూరి’ ఆవేశానికి గురై ,తానే పోటీ చేస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది.అత్యంత ముఖ్యుడైన ఈయన కోపగిస్తే పరిస్థితి మరింత జటిలమవుతుందని ఆయనను బుజ్జగించడానికి ‘నరేన్ కొడాలి’వర్గ ప్రముఖుడైన డీసీ నాయకుడు ‘రవి పొట్లూరి’ నివసించే ప్రదేశానికి వెళ్లినట్లు పక్కా సమాచారం.ఈ రెండు వర్గాల గొడవలతో సంబంధం లేని, పోటీ పై ఖచ్చితమైన నిర్ణయంతో ‘శ్రీనివాస గోగినేని ‘వర్గం తమదైన విధానంతో మద్దతు పెంచుకుంటూ సాగిపోతున్నారు.వెరసి రాబోయే రెండు మూడు రోజుల్లో ఏమైనా జరగవచ్చునని భావించవచ్చు.
క్రితం ఆర్టికల్ లో ఉదహరించిన పాట మీ కోసం మరొక్క సారి
‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? కంచెయే తానుగా చేను మేసినా కాదనువారెవరూ? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?’