దాదాపు మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిరచి తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం. ఐదారేళ్ల ముందు వరకు ఆయన ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాలోనూ దాదాపుగా ఆయన కనిపించేవారు.
హీరో తర్వాత అంత హైలైట్ అయ్యే పాత్రల్లో కనిపించేవాడు బ్రహ్మి. ఏటా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ క్రేజీ కామెడీ రోల్స్‌తో అదరగొడుతూ వచ్చిన ఈ లెజెండ్.. కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడమే గగనం అయిపోయింది. వరుసగా ఆయన క్యారెక్టర్లు కొన్ని ఫెయిలవడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో బ్రహ్మి దాదాపు తెరమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఐతే సినిమాల్లో కనిపించలేదన్న మాటే కానీ.. ఆయన్ని జనాలు ఎంతమాత్రం మరిచిపోయే పరిస్థితి లేదు. సోషల్ మీడియా ఏ సందర్భానికి తగ్గట్లు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా బ్రహ్మి హావభావాల తాలూకు ఫొటోలు, జీఐఎఫ్‌లు, మీమ్సే వాడుకుంటారు నెటిజన్లు.
బ్రహ్మానందం లేకుండా తెలుగు మీమ్ పేజీలే ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ఈ రకంగా ఆయన ఎప్పటికీ లైమ్ లైట్లో ఉన్నట్లే. సోషల్ మీడియాలో ఎప్పుడూ జనాల నోళ్లలో నానుతున్నప్పటికీ బ్రహ్మి ఇకపై సినిమాల్లో మాత్రం మళ్లీ బిజీ కావడం కష్టమే అనుకున్నారు. కానీ ఆయన మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుండటం విశేషం.
సంక్రాంతికి రానున్న భారీ చిత్రం భీమ్లానాయక్లో బ్రహ్మి ఓ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తాజాగా వెల్లడైంది. అది కామెడీ రోలేనట. అలాగే కృష్ణవంశీ మూవీ రంగమార్తాండలోనూ బ్రహ్మి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అది సీరియస్ క్యారెక్టర్ అని సమాచారం.
ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. తాను శర్వానంద్, నితిన్ హీరోలుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రాల్లోనూ నటిస్తున్నట్లు కూడా బ్రహ్మి వెల్లడిరచారు. నితిన్ సినిమాకు సంబంధించి బ్రహ్మానందం పాత్ర విషయంలో ఈ మధ్య ఒక రూమర్ నడిచింది. ఆయన షూటింగ్‌కి టైంకి రాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి.
కానీ ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు బ్రహ్మి చెప్పడంతో ఆ రూమర్లకు చెక్ పడిరది. మొత్తానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారంటే బ్రహ్మి మళ్లీ బిజీ అయినట్లే కనిపిస్తోంది. ఆయన పాత్రలు మళ్లీ క్లిక్ అయ్యాయంటే పూర్వవైభవం తిరిగొస్తుందేమో. చూద్దాం మరి.