• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భోజనం పెట్టినట్లు ప్రూఫ్ కావాలా…ఇదేం ప్రశ్న బొత్స?

admin by admin
January 30, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
534
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రజా ప్రతినిధులు….అంటే ప్రజలకు ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. ఆ ఉద్దేశ్యంతోనే ప్రజలు వారికి ఓట్లు వేసి తమ ప్రతినిధిగా అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తుంటారు. అయితే, ఓటు వేయకముందు ఓటు మల్లన్న ….ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది నేటి ప్రజాప్రతినిధుల ప్రవర్తన. ఇక, ఏపీలోని వైసీపీ నేతల ప్రవర్తన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓటర్ల సంగతి పక్కనబెడితే…ప్రభుత్వాన్ని నమ్ముకొని రకరకాల పనులు చేసి బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ నేపథ్యంలోనే 8 నెలలుగా తన బిల్లు పెండింగ్ ఉందని గోడు చెప్పుకునేందకు వెళ్లిక కాంట్రాక్టర్ పై మంత్రి బొత్స దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో సర్దార్‌ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బొత్స మాట్లాడుతుండగా బొబ్బిలి పట్టణానికి చెందిన జగదీశ్వరరావు అనే క్యాటరింగ్‌ నిర్వాహకుడు సభావేదిక దగ్గరకు వచ్చి బొత్సకు అర్జీ అందజేశారు. గతంలో కొవిడ్‌ కేర్‌ సెంటరులో భోజన సదుపాయం కల్పించానని, దానికి సంబంధించిన ఏడున్నర లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని విన్నవించారు. 8 నెలలైనా బిల్లులు రాలేదని వాపోయారు.

అయితే, అనూహ్యంగా జగదీశ్వరరావుపై బొత్స విరుచుకుపడ్డారు. ‘‘టీవీల్లో కనిపించేందుకు హడావిడి చేస్తున్నావు. అసలు భోజనం పెట్టావో? లేదో? దానికి నీ దగ్గర గ్యారంటీ ఉందా? భోజనం పెట్టలేదని నేను అంటున్నాను. పక్కకు వెళ్లు’’ అంటూ చీదరించుకోవడంతో జగదీశ్వరరావు చిన్నబోయారు. అంతేకాదు, కోట్ల రూపాయలు వెచ్చించి వేలాది ఎకరాలకు సాగునీరందించే మంచి పథకానికి జరిపే శంకుస్థాపన కార్యక్రమాలు కొన్ని టీవీల్లో కనిపించవంటూ కొన్ని మీడియా సంస్థలనుద్దేశించి తన అసహనాన్ని కూడా బొత్స వెళ్లగక్కారు. ఇక, అలాంటి టీవీలు, పేపర్లు అవసరమా? అంటూ వాటిపై విషం చిమ్మారు. కాగా, తనకు రావాల్సిన  బిల్లు గురించి మంత్రికి చెబితే న్యాయం జరుగుతుందని భావించానని, కానీ, ఇలా చీదరించుకుంటారనుకోలేదని జగదీశ్వరరావు వాపోయారు.

Tags: botsa rash behaviourcatering contractorminister botsa satyannarayanapending billsshocking comments
Previous Post

Pooja Hegde: వాటిని చూపించకుండా ఉండలేదా

Next Post

జగన్ కు ట్రెజరీ ఉద్యోగుల షాక్…తగ్గేదేలే

Related Posts

Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post
జగన్

జగన్ కు ట్రెజరీ ఉద్యోగుల షాక్...తగ్గేదేలే

Please login to join discussion

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra