వారంతా సొంత పార్టీ నేత లు.. పైగా పట్టణ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు. వారేదో తమ సమస్యలు చెప్పుకొనేందుకు ముందుకు వచ్చారు. మరి వారి పట్ల సానుకూలంగా వ్యవహరించి.. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మంత్రిగా ఉన్నవారిపై ఉంటుంది. కానీ, దీనికి విరుద్ధంగా వ్యవహరించారు ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ చెప్పుకొనేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్సీపై ‘మాకు లేవా బాధలు.. మీకేనా.. యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా` అని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో నేతలు అవాక్కయ్యారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. శృంగవరపుకోటలో మహిళా సంఘాలకు మూడో విడత ఆసరా పథకం చెక్కుల పంపిణీ నిర్వహించారు. మండల పరిషత్తు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసరా కార్యక్రమం ముగించుకుని మంత్రి వెళ్తుండగా కాన్వాయ్ దగ్గరకు స్థానిక నాయకులు, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ వైసీపీ అధ్యక్షుడు రహిమాన్ ఆధ్వర్యంలో పరుగుపరుగున వెళ్లారు.
వారి సమస్యలు ఏవో చెప్పుకొనేందుకు ప్రయత్నించారు. అయితే.. సమస్యలు వినకముందే.. సదరు నాయకులపై మంత్రి బొత్స మండిపడ్డారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై.. పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రెహమాన్.. మంత్రికి ఫిర్యాదు చేశాడు. పట్టణంలో గ్రూపులు కట్టి.. సొంత పార్టీ నాయకులనే ఓడించిన వారికి తిరిగి పదవులు కట్టబెడుతున్నారంటూ రహిమాన్ మంత్రి వద్ద వాపోయారు. అయితే.. వీరు చెప్పేది పూర్తిగా వినకముందే.. మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
“మాకు లేవా బాధలు.. మీకేనా.. యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా” అంటూ మంత్రి రెచ్చిపో యారు. ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. కావాలంటే విజయనగరం రండి మాట్లాడు దాం అంటూ వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రహమాన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన వినలేదు. మా బాధలు పట్టించుకోండి అంటూ మంత్రికి అడ్డు చెప్పబోయాడు.
దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి… రెహమాన్‌పై మండిపడ్డాడు. “మాకు లేవా బాధలు… మీకేనా… యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా” అంటూ మంత్రి రెచ్చిపోయారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించేందుకు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కాన్వాయ్ దగ్గరకు వెళ్లి ప్రయత్నించగా… కెమెరా ఆపమని మంత్రి బొత్స ఆదేశించారు. దీంతో పోలీసులు.. కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేయడం గమనార్హం.