• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘బండ్ల’ బూతుల వెనుక ఆ సీనియర్ మంత్రి?

admin by admin
April 21, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
466
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ల మద్య ట్వీట్ వార్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా ఈ ఇద్దరి మధ్య ‘బండ్ల’ బూతులు నడవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరి బ్లేడ్ ఛాలెంజ్ అంటూ నానా హంగామా చేసి సైలెంట్ అయిన బండ్ల గణేష్…హఠాత్తుగా విజయసాయిపై విమర్శలతో మరోసారి పొలిటికల్ సర్కిళ్లలో తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

ఎన్నడూ వైసీపీ నేతల జోలికి వెళ్లని బండ్ల గణేష్ హఠాత్తుగా సాయిరెడ్డిని టార్గెట్ చేయడం ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా,  విజయసాయి రెడ్డి ప్రవర్తనలో హఠాత్తుగా వచ్చిన మార్పులు కూడా ఏమీ లేవు. మూడేళ్లుగా కమ్మ సామాజిక వర్గంపై సాయిరెడ్డి ఏ రకంగా ఏడుస్తున్నారో..ఇపుడు కూడా అలాగే ఉన్నారు. ఈ క్రమంలోనే విజయసాయిపై బండ్ల తుఫాన్ విరుచుకుపడడానికి కారణం మంత్రి బొత్స సత్యనారాయణ అన్న పుకార్లు విశాఖ రాజకీయాల్లో షికార్లు చేస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో విజయసాయి హవా సాగిస్తుండడం ఉత్తరాంధ్ర సీనియర్ నేత అయిన సత్తిబాబుకు బొత్తిగా నచ్చలేదట. ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా బొత్స-విజయసాయిల మధ్య సంబంధాలు గొప్పగా లేవు. ఈ క్రమంలోనే తన మంత్రిత్వ శాఖ మారడం, ప్రాధాన్యత లేని శాఖ దొరకడం వంటి వ్యవహారాలకు విజయసాయిరెడ్డే కారణమని బొత్స ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స ఫీలవడాన్ని జీర్ణించుకోలేని ఆయన ప్రాణ స్నేహితుడు బండ్ల గణేష్ హఠాత్తుగా సాయిరెడ్డిపై ట్వీట్ వార్ డిక్లేర్ చేశారని తెలుస్తోంది.

బొత్స, బండ్లల మధ్య స్నేహం గురించి చాలామందికి తెలీదు. కానీ, హైదరాబాద్ వస్తే బొత్స తోనే బండ్ల గణేష్ ఉంటారు. ఈ క్రమంలోనే తన మిత్రుడికి విజయసాయి వల్ల అన్యాయం జరుగిందన్న ఆలోచనతో బండ్ల బూతులతో విరుచుకుపడ్డారని తెలుస్తోంది. అయితే, బండ్ల బూతుల వెనుక తానున్నానన్న విషయాన్ని బొత్స తోసిపుచ్చుతున్నారు. అంతేకాదు, ఇలాంటి వార్తలు వచ్చినందుకు సత్తిబాబు హర్ట్ అయ్యారట. అసలు ,తన ట్వీట్ లకు బొత్సకు సంబంధం లేదని బండ్ల కూడా అంటున్నారు.

ఏది ఏమైనా…బొత్సకు శాఖ కేటాయింపు పర్యవసానంతోనే విజయసాయిపై బండ్ల వార్ మొదలుబెట్టారని జగన్ కు తెలిస్తే మాత్రం బొత్సకు ఇక్కట్లు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా తిరుగుబాటులు, బెదిరింపులు, ఎదురుదాడులు సహించని జగన్…విజయసాయి విషయంలో ఈ తరహా పరిణామాలను అస్సలు ఎంకరేజ్ చేయకపోవచ్చు.

Tags: bandla ganeshbandla ganesh slams vijaya saibotsa behind bandla ganeshminister botsa satyannarayanatweet warvijaya sai reddy
Previous Post

మొద‌లైన విజ‌య్‌-స‌మంతల‌ ప్రేమాయ‌ణం!

Next Post

ఏబీవీ విషయంలో జగన్ కు సుప్రీం షాక్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ఏబీవీ విషయంలో జగన్ కు సుప్రీం షాక్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra