నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తన మానస పుత్రికగా భావించిన టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమం త్రి చంద్రబాబు.. దీనిని రైజింగ్ స్టేట్ క్యాపిటల్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. దీనిని అత్యంత ఆధునిక హంగులతో తీర్చిదిద్ది.. దేశానికే తలమానికంగా.. తీర్చిదిద్దాలని కలలు కన్నారు. అయితే.. ముందు ఉ.. అని .. తర్వాత.. ఉఊ అన్న.. వైసీపీ నేతల కారణంగా.. ప్రస్తుతం అమరావతి దుస్థితిని ఎదుర్కొంటోంది. ఏపీకి ఒకరాజధాని కూడా లేని పరిస్థితి ఎదురైంది.
అయితే.. అసలు అమరావతిని చంద్రబాబు అక్కడే ఎందుకు నిర్మించాలని అనుకున్నారు? దీనికి కార ణ మేంటి? అమరావతిపై వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..ఏం చెప్పారు.. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు? అనే అనేక విషయాలు ఇప్పటికీ.. ఆసక్తిగానే ఉన్నాయి. అమరావతి ప్రస్తావన వచ్చినప్పు డల్లా.. ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. రాజధాని రైతులు ఉద్యమించిన సమయం లో అయితే.. అమరావతిపై.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించారు.
దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అంటుంటే.. కాదు.. చంద్రబాబు ఆయన అను యాయుల వ్యక్తిగతకారణాలు ఆర్థిక లబ్ధి ఉన్నాయని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి అస లు అమరావతి విషయంలో జరిగింది ఏంటి? అమరావతిని గ్రాఫిక్స్ మాయాజాలంగా పేర్కొన్న వైసీపీ వాదన ఎంత వరకు వాస్తవం.. కోర్టులు.. కేసులు… అనుమతులు.. అప్పులు.. ఆదాయాలు.. వీటి గురించి.. ఏది నిజం.. ? అనే విషయాలపై.. పాత్రికేయుడు కందుల రమేష్ పుస్తకం రచించారు.
అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అడ్డుపుల్లలు, ఆరోపణలు, కోర్టు కేసులతో అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వారు.. అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేశారని పేర్కొన్నారు. ‘అమరావతి: వివాదాలు- వాస్తవాలు’ పేరుతో రాసిన పుస్తకం.. గురువారం ప్రజల ముందుకు రానుంది.
అమరావతిపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతూ, అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అనేక వివాదాలు సృ ష్టించిన వైసీపీ.. ప్రభుత్వంలోకి వచ్చినా అదే ధోరణి కొనసాగించిందని, అమరావతి ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని… లేనిపోని వివాదాలు సృష్టించిందని, కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ నాయకుల ధోరణి మారలేదని ఆయన పేర్కొన్నారు.
అమరావతి పరిణామ క్రమాన్ని నిశితంగా పరిశీలించిన ఆయన.. అమరావతిపై ముసురుకున్న వివాదా లేంటి, వాటికి కారకులెవరు, వాటిలో వాస్తవమెంత, వైసీపీ పాత్రేంటి? స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల ముసుగులో ఆ వివాదాలకు మద్దతిచ్చినవారెవరు? చివరకు వారెలా భంగపడ్డారన్న విషయాల్ని కూలంకషంగా, సాధికారికంగా చర్చించారు.